Vivarimchi seppavayyaa vinavedugayyee vagu

వివరించి చెప్పవయ్యా వినవేడుకయ్యీ వకు
Language

(॥పల్లవి॥)
వివరించి చెప్పవయ్యా వినవేడుకయ్యీ వకు
సవరఁగా నేము తెరచాటుననే వుంటిమి

(॥వివ॥)
యింతవడి నాపె నీవూ నేకతము లాడితివి
పంతమున నది యెంతపనికో కాని
చెంతఎ దెరలో కొలువసేయించుకొంటా నుంటివి
వింతలుగా నెటువంటివేడుకోకాని

(॥వివ॥)
చప్పుడుగా విడే లాపెజంట నుండి సేసితివి
దప్పిదేర నెటువంటితమియోకాని
తప్పక జాగరాలు తఱచుగాఁ బెంచితివి
గొప్పగా నేమిగడించుకొంటివోకాని

(॥వివ॥)
ననుపున నాపెతోను నవ్వుతానే వుండితివి
సొనిపి యేమిమర్మాలు సోఁకెనోకాని
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్‌మంగను
ననుఁ గూడితివి యెంత నాపైబత్తోకాని

(||pallavi||)
vivariṁchi sĕppavayyā vinaveḍugayyī vagu
savaram̐gā nemu tĕrasāḍunane vuṁṭimi

(||viva||)
yiṁtavaḍi nābĕ nīvū negadamu lāḍidivi
paṁtamuna nadi yĕṁtabanigo kāni
sĕṁtæ dĕralo kŏluvaseyiṁchugŏṁṭā nuṁṭivi
viṁtalugā nĕḍuvaṁṭiveḍugogāni

(||viva||)
sappuḍugā viḍe lābĕjaṁṭa nuṁḍi sesidivi
dappidera nĕḍuvaṁṭidamiyogāni
tappaga jāgarālu taṟasugām̐ bĕṁchidivi
gŏppagā nemigaḍiṁchugŏṁṭivogāni

(||viva||)
nanubuna nābĕdonu navvudāne vuṁḍidivi
sŏnibi yemimarmālu som̐kĕnogāni
yĕnasidivi śhrīveṁkaḍeśha yalamel‌maṁganu
nanum̐ gūḍidivi yĕṁta nābaibattogāni