విచారించుకో నీవే వెనకా ముందరా నించి
(॥పల్లవి॥)
విచారించుకో నీవే వెనకా ముందరా నించి
పచారించి విభుఁడవు పంతమాడవలెనా
(॥విచా॥)
అండనుండి యిచ్చకములాడేవారము గాక
మెండుకొని నీమాట మీరేవారమా
నిండుకొన బ్రియములు నెలంతలు చెప్పితేను
కొండవంటి దొరకును కోపగించఁ దగదు
(॥విచా॥)
ననుపుతో మోముచూచి నవ్వేవారముగాక
కినిసి వూరకే తమకించేవారమా
తనవారైనా యట్టితరుణులు నిల్చితేను
ఘనుఁడైనవానికి కాదనగదగదు
(॥విచా॥)
సేవలెల్లాం జేసి బుద్ది చెప్పేవారముగాక
వావాత దూరి నిన్ను వంచేవారమా
ఆవేళ నలమల్ మంగనయి నిన్ను బెండ్లాడితి
శ్రీవేంకటేశ నీకు సిగ్గువడఁ దగదు
(||pallavi||)
visāriṁchugo nīve vĕnagā muṁdarā niṁchi
pasāriṁchi vibhum̐ḍavu paṁtamāḍavalĕnā
(||visā||)
aṁḍanuṁḍi yichchagamulāḍevāramu gāga
mĕṁḍugŏni nīmāḍa mīrevāramā
niṁḍugŏna briyamulu nĕlaṁtalu sĕppidenu
kŏṁḍavaṁṭi dŏragunu kobagiṁcham̐ dagadu
(||visā||)
nanubudo momusūsi navvevāramugāga
kinisi vūrage tamagiṁchevāramā
tanavārainā yaṭṭidaruṇulu nilsidenu
ghanum̐ḍainavānigi kādanagadagadu
(||visā||)
sevalĕllāṁ jesi buddi sĕppevāramugāga
vāvāda dūri ninnu vaṁchevāramā
āveḽa nalamal maṁganayi ninnu bĕṁḍlāḍidi
śhrīveṁkaḍeśha nīgu sigguvaḍam̐ dagadu