విరించినై విరచించితిని ఈ కవనం
పల్లవి:
విధాత తలపున ప్రభవించినది... అనాది జీవన వేదం... ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం... ఓం...
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వ రూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం... ఆ...
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది ||2||
నే పాడిన జీవన గీతం... ఈ గీతం...
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం...
చరణం 1:
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన ||ప్రాగ్దిశ||
పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా... ||విరించినై||
చరణం 2:
జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం ||జనించు||
అనాది రాగం ఆదితాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాపముగా ||విరించినై||
నా ఉచ్చ్వాసం కవనం
నా నిశ్వాసం గానం ||2|| ||సరస||
pallavi:
vidhāda talabuna prabhaviṁchinadi... anādi jīvana vedaṁ... oṁ...
prāṇanāḍulagu spaṁdananŏsagina ādi praṇavanādaṁ... oṁ...
kanula kŏlanulo pradibiṁbiṁchina viśhva rūba vinyāsaṁ
ĕda kanumalalo pradidhvaniṁchina viriṁchi vibaṁchi gānaṁ... ā...
sarasasvara surajharī gamanamau sāmaveda sāramidi ||2||
ne pāḍina jīvana gīdaṁ... ī gīdaṁ...
viriṁchinai virasiṁchidini ī kavanaṁ
vibaṁchinai vinibiṁchidini ī gīdaṁ...
saraṇaṁ 1:
prāgdiśha vīṇiyabaina dinagara mayūkha taṁtrulabaina
jāgṛta vihaṁga tadule vinīla gaganabu vedigabaina ||prāgdiśha||
paligina kilagila svanamula svaragadi jagadigi śhrīgāramu kāgā
viśhvagāvyamunagidi bhāṣhyamugā... ||viriṁchinai||
saraṇaṁ 2:
janiṁchu pradi śhiśhugaḽamuna paligina jīvana nāda taraṁgaṁ
sedana pŏṁdina spaṁdana dhvaniṁchu hṛdaya mṛdaṁga dhvānaṁ ||janiṁchu||
anādi rāgaṁ ādidāḽamuna anaṁta jīvana vāhinigā
sāgina sṛṣhṭi vilābamugā ||viriṁchinai||
nā uchchvāsaṁ kavanaṁ
nā niśhvāsaṁ gānaṁ ||2|| ||sarasa||