Vinnavimchidimi neevidyalellaanu

విన్నవించితిమి నీవిద్యలెల్లాను
Language

(॥పల్లవి॥)
విన్నవించితిమి నీవిద్యలెల్లాను
అన్నియుఁ జెప్పీఁగాని ఆకె నీకు బుద్దులు

(॥విన్న॥)
వెలలేని వలపుల వేడుకకాఁడ
పలు సరసంబుల పగిడికొండ
నిలువులయెమ్ములనీటుకాఁడ
పిలిచీ రావయ్య ప్రియురాలు

(॥విన్న॥)
చల్లేటికర్పూరపుజాజరకాఁడ
గొల్లెతలమానములకొల్లకాండ
చల్లువె నవ్వుల సటకాఁడా
యిల్లిదె పిల్చీ రావయ్య యితవురాలు

(॥విన్న॥)
వంకచందురులచెక్కువన్నెకాఁడా
కొంకతక కూడె నిన్నాపె కోడెకాఁడా
అంకెల శ్రీవేంకటాద్రి ఆసోదకాఁడా
బింకానఁ బిలిచీ రామయ్య బిత్తరాలు

(||pallavi||)
vinnaviṁchidimi nīvidyalĕllānu
anniyum̐ jĕppīm̐gāni āgĕ nīgu buddulu

(||vinna||)
vĕlaleni valabula veḍugagām̐ḍa
palu sarasaṁbula pagiḍigŏṁḍa
niluvulayĕmmulanīḍugām̐ḍa
pilisī rāvayya priyurālu

(||vinna||)
salleḍigarbūrabujājaragām̐ḍa
gŏllĕdalamānamulagŏllagāṁḍa
salluvĕ navvula saḍagām̐ḍā
yillidĕ pilsī rāvayya yidavurālu

(||vinna||)
vaṁkasaṁdurulasĕkkuvannĕgām̐ḍā
kŏṁkadaga kūḍĕ ninnābĕ koḍĕgām̐ḍā
aṁkĕla śhrīveṁkaḍādri āsodagām̐ḍā
biṁkānam̐ bilisī rāmayya bittarālu