Vinnavimchidimi neegu vedugavela

విన్నవించితిమి నీకు వేడుకవేళ
Language

(॥పల్లవి॥)
విన్నవించితిమి నీకు వేడుకవేళ
కన్నెను నీవు దయఁ గాచేటివేళ

(॥విన్న॥)
మచ్చికలు దయివారె మనసెల్ల జైవారె
వచ్చె జవ్వనానకు వసంతవేళ
చొచ్చి నిన్నుఁ బాసి తాపసూర్యుఁ డెండగాయఁగా
విచ్చనవిడిగాఁ దోఁచె వేసగివేళ

(॥విన్న॥)
సిగ్గులు మొలవఁజొచ్చె చెమటలేరులు హెచ్చె
కగ్గులేక మించె వానకాలపువేళ
వెగ్గళించి సెలవుల వెన్నెలలు చూపట్టి
వొగ్గి శరత్కాలము వొదిగె నీవేళ

(॥విన్న॥)
తత్తరపుచలి పొంచె తలపోఁతమంచు మించె
యెత్తి యలమేల్మంగకు హేమంతవేళ
బత్తితో శ్రీవేంకటేశ పైకొని కూడితి విట్టె
చిత్తజుకాఁకలు దేరె సిసిరవేళ

(||pallavi||)
vinnaviṁchidimi nīgu veḍugaveḽa
kannĕnu nīvu dayam̐ gāseḍiveḽa

(||vinna||)
machchigalu dayivārĕ manasĕlla jaivārĕ
vachchĕ javvanānagu vasaṁtaveḽa
sŏchchi ninnum̐ bāsi tābasūryum̐ ḍĕṁḍagāyam̐gā
vichchanaviḍigām̐ dom̐sĕ vesagiveḽa

(||vinna||)
siggulu mŏlavam̐jŏchchĕ sĕmaḍalerulu hĕchchĕ
kaggulega miṁchĕ vānagālabuveḽa
vĕggaḽiṁchi sĕlavula vĕnnĕlalu sūbaṭṭi
vŏggi śharatkālamu vŏdigĕ nīveḽa

(||vinna||)
tattarabusali pŏṁchĕ talabom̐tamaṁchu miṁchĕ
yĕtti yalamelmaṁgagu hemaṁtaveḽa
battido śhrīveṁkaḍeśha paigŏni kūḍidi viṭṭĕ
sittajugām̐kalu derĕ sisiraveḽa