Vinnavimchare yeemaada vibhunigim jelulaala

విన్నవించరే యీమాట విభునికిఁ జెలులాల
Language

(॥పల్లవి॥)
విన్నవించరే యీమాట విభునికిఁ జెలులాల
కన్నుల సన్నలనే కానవచ్చీ వలపు

(॥విన్న॥)
చెక్కులఁబెట్టినచేయి సిగ్గులకు మూలము
మొక్కినమొక్కులు ప్రియములకు దాపు
నిక్కినిక్కి చూపులు నిండుమోహములచోప్పు
ఇక్కువలు చూచికోరే ఇంతిభావములను

(॥విన్న॥)
మోనముననుండినదె మోహమునకు మూలము
వానలచెమటలే జవ్వనము చిహ్న
తానకపునిట్టూర్పులు తలపోఁతలకు వింత
పూని కనుఁగోనరే ఇపుడు తారుకాణలు

(॥విన్న॥)
సెలవినవ్వులు రతి సేఁతలకు సన్నలు
కలఇకలకుమోముకళ లెరుక
అలమె శ్రీవేంకటేశు డలమేల్‌మంగ నీకెను
యెలమితోఁ బొగడరే యీకె మేచ్చీ నితని

(||pallavi||)
vinnaviṁchare yīmāḍa vibhunigim̐ jĕlulāla
kannula sannalane kānavachchī valabu

(||vinna||)
sĕkkulam̐bĕṭṭinaseyi siggulagu mūlamu
mŏkkinamŏkkulu priyamulagu dābu
nikkinikki sūbulu niṁḍumohamulasoppu
ikkuvalu sūsigore iṁtibhāvamulanu

(||vinna||)
monamunanuṁḍinadĕ mohamunagu mūlamu
vānalasĕmaḍale javvanamu sihna
tānagabuniṭṭūrbulu talabom̐talagu viṁta
pūni kanum̐gonare ibuḍu tārugāṇalu

(||vinna||)
sĕlavinavvulu radi sem̐talagu sannalu
kala̮igalagumomugaḽa lĕruga
alamĕ śhrīveṁkaḍeśhu ḍalamel‌maṁga nīgĕnu
yĕlamidom̐ bŏgaḍare yīgĕ mechchī nidani