విన్నవించరే యీమాట వెలఁదులాల
(॥పల్లవి॥)
విన్నవించరే యీమాట వెలఁదులాల
పన్ని తన సుద్దులేమి బాయిట వేయనే
(॥విన్న॥)
జగమెల్ల నెరఁగఁగ సతి నయితిఁ దనకు
తగ వించుకంతా దప్ప తనపాలికి
వెగటుగా దానెంత వేడుక కాఁడైనాను
నగేఁగాని వింతతనము సేయనే
(॥విన్న॥)
సిగ్గు నెగ్గులు నెంచక చిత్తమురా నడచితి
దగ్గరి దక్కి వుంటిని తనపాలికి
వెగ్గళించి తనసేఁత వెల్లావిరులైనను
వొగ్గి తన్ను మెచ్చేఁగాని వొరటులు చూపనే
(॥విన్న॥)
కలసి మెలసి వుండి కాఁగిలించుకొంటిని
తలఁపు వొప్పగించితి తనపాలికి
యెనసె శ్రీ వేంకటేశుఁడిఁక నేమి సేసినాను
చనవిచ్చేఁగాని మరి సాదించనేరనే
(||pallavi||)
vinnaviṁchare yīmāḍa vĕlam̐dulāla
panni tana suddulemi bāyiḍa veyane
(||vinna||)
jagamĕlla nĕram̐gam̐ga sadi nayidim̐ danagu
taga viṁchugaṁtā dappa tanabāligi
vĕgaḍugā dānĕṁta veḍuga kām̐ḍainānu
nagem̐gāni viṁtadanamu seyane
(||vinna||)
siggu nĕggulu nĕṁchaga sittamurā naḍasidi
daggari dakki vuṁṭini tanabāligi
vĕggaḽiṁchi tanasem̐ta vĕllāvirulainanu
vŏggi tannu mĕchchem̐gāni vŏraḍulu sūbane
(||vinna||)
kalasi mĕlasi vuṁḍi kām̐giliṁchugŏṁṭini
talam̐pu vŏppagiṁchidi tanabāligi
yĕnasĕ śhrī veṁkaḍeśhum̐ḍim̐ka nemi sesinānu
sanavichchem̐gāni mari sādiṁchanerane