విన్నవించరే యీ మాఁట విభుఁడెదుట నున్నాఁడు
(॥పల్లవి॥)
విన్నవించరే యీ మాఁట విభుఁడెదుట నున్నాఁడు
ఇన్నిటా నన్నాదరించె నేమనీనో ఇఁకను
(॥విన్న॥)
తెగరానిచోట్లను దీమసమే సంగతి
నగరానిచోట్లను నాలి సంగతి
మొగమోడే చోట్లను మోనములే సంగతి
తగవులఁ బెట్టేనా తన చిత్తమిఁకను
(॥విన్న॥)
పాయరానిచోట్లను పదరినిదే సంగతి
తోయరానిచోట్ల పొందులు సంగతి
ఆయము లంటుచోట్ల నంగవించుటే సంగతి
యాయెడఁ దనతో నేను యేమనేనే ఇఁకను
(॥విన్న॥)
సమ్మతించినచోట్ల సరిఁగూడుటే సంగతి
నమ్మి కైనచోట్లను నంటు సంగతి
ఇమ్ముల శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్ను నేలె
కమ్మి యెంత మన్నించినా గాదనేనా ఇఁకను
(||pallavi||)
vinnaviṁchare yī mām̐ṭa vibhum̐ḍĕduḍa nunnām̐ḍu
inniḍā nannādariṁchĕ nemanīno im̐kanu
(||vinna||)
tĕgarānisoṭlanu dīmasame saṁgadi
nagarānisoṭlanu nāli saṁgadi
mŏgamoḍe soṭlanu monamule saṁgadi
tagavulam̐ bĕṭṭenā tana sittamim̐kanu
(||vinna||)
pāyarānisoṭlanu padarinide saṁgadi
toyarānisoṭla pŏṁdulu saṁgadi
āyamu laṁṭusoṭla naṁgaviṁchuḍe saṁgadi
yāyĕḍam̐ danado nenu yemanene im̐kanu
(||vinna||)
sammadiṁchinasoṭla sarim̐gūḍuḍe saṁgadi
nammi kainasoṭlanu naṁṭu saṁgadi
immula śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnu nelĕ
kammi yĕṁta manniṁchinā gādanenā im̐kanu