Vinnadaamkaa tahadaha viduvademogaani

విన్నదాఁకా తహతహ విడువదేమోకాని
Language

(॥పల్లవి॥)
విన్నదాఁకా తహతహ విడువదేమోకాని
పన్ని సిగ్గువడైతే పచారించ నిన్నును

(॥విన్న॥)
ఇప్పుడేమేకతమాడె ఇంతి నీతో నిందాఁకా
చెప్పరానిమాటలైతేఁ జెప్పవలదు
తప్పక చూచె నదేమి దండ నుండి యాపె నిన్ను
కప్పి యది దాఁచేదైతే గాసిఁబెట్ట నిన్నును

(॥విన్న॥)
సన్నలేల సేసె నీతో జలజాక్షి ఇందాఁకా
మిన్నక రహస్యమైతే మీలో నుండనీ
చిన్నినవ్వు నవ్వె నేమీ సెలవులఁ దానే యాకె
నిన్ను సోఁకివచ్చేదైతే నే నడుగ నిన్నును

(॥విన్న॥)
కానుక లేమిటికిచ్చె కలికి నీ కిందాఁకా
పూని గుట్టు సేసేదైతే పోరాడవద్దు
ఆనుక శ్రీవేంకటేశ అదేమీ నన్నేలితివి
కానియాకె అప్పణయితే కాఁతాళించ నిన్నును

(||pallavi||)
vinnadām̐kā tahadaha viḍuvademogāni
panni sigguvaḍaide pasāriṁcha ninnunu

(||vinna||)
ippuḍemegadamāḍĕ iṁti nīdo niṁdām̐kā
sĕpparānimāḍalaidem̐ jĕppavaladu
tappaga sūsĕ nademi daṁḍa nuṁḍi yābĕ ninnu
kappi yadi dām̐sedaide gāsim̐bĕṭṭa ninnunu

(||vinna||)
sannalela sesĕ nīdo jalajākṣhi iṁdām̐kā
minnaga rahasyamaide mīlo nuṁḍanī
sinninavvu navvĕ nemī sĕlavulam̐ dāne yāgĕ
ninnu som̐kivachchedaide ne naḍuga ninnunu

(||vinna||)
kānuga lemiḍigichchĕ kaligi nī kiṁdām̐kā
pūni guṭṭu sesedaide porāḍavaddu
ānuga śhrīveṁkaḍeśha ademī nannelidivi
kāniyāgĕ appaṇayide kām̐tāḽiṁcha ninnunu