Vinnabamu nem jesedi vimtivaa voyi

విన్నపము నేఁ జేసేది వింటివా వోయి
Language

(॥పల్లవి॥)
విన్నపము నేఁ జేసేది వింటివా వోయి
కన్నెను నన్నిఁకనైన కరుణించవోయి

(॥విన్న॥)
పక్కన నే నీతోను పంతము లాడితినంటా
యెక్కువ తక్కువ లాడీ యేమోయి యీపె
చక్కని నీమీఁది బత్తో సవతి మచ్చరమో
తెక్కువ నీ కిదేమైనాఁ దెలుసునా వోయి

(॥విన్న॥)
చేయి చాఁచి నీమీఁద సేసలు చల్లితినంటా
రాయడించె నిన్న మొన్న రంతుల నీపె
పాయపు వికారమో పతిబందమో తాను
నాయము దిద్దనేర్తువా నంటున నీవోయి

(॥విన్న॥)
నెమ్మది శ్రీ వేంకటేశ నిన్ను నేఁ గూడితినంటా
కమ్మటి తా నుస్సురని కరఁగీ నీపె
యెమ్మెలు దా నెరపెనో యెడ్డతనము చేసెనో
చిమ్ముల నింతట బుద్ది చెప్పేవా వోయి

(||pallavi||)
vinnabamu nem̐ jesedi viṁṭivā voyi
kannĕnu nannim̐kanaina karuṇiṁchavoyi

(||vinna||)
pakkana ne nīdonu paṁtamu lāḍidinaṁṭā
yĕkkuva takkuva lāḍī yemoyi yībĕ
sakkani nīmīm̐di batto savadi machcharamo
tĕkkuva nī kidemainām̐ dĕlusunā voyi

(||vinna||)
seyi sām̐si nīmīm̐da sesalu sallidinaṁṭā
rāyaḍiṁchĕ ninna mŏnna raṁtula nībĕ
pāyabu vigāramo padibaṁdamo tānu
nāyamu diddanerduvā naṁṭuna nīvoyi

(||vinna||)
nĕmmadi śhrī veṁkaḍeśha ninnu nem̐ gūḍidinaṁṭā
kammaḍi tā nussurani karam̐gī nībĕ
yĕmmĕlu dā nĕrabĕno yĕḍḍadanamu sesĕno
simmula niṁtaḍa buddi sĕppevā voyi