వినవేడుకయ్యీ మాకు వింతవింత మీ సుద్దులు
(॥పల్లవి॥)
వినవేడుకయ్యీ మాకు వింతవింత మీ సుద్దులు
మనసు లొక్కటిగాను మాకు నెఱిఁగించవే
(॥విన॥)
చెలరేఁగిచెలరేఁగి సెలవుల నవ్వేవు
యెలమి నాతఁడు నిన్ను నేమిసేసెనే
బలిమి నూరకె నీవు పలుమారుఁ బెనఁగేవు
అలరినమీచెనకు అవి యెటువంటివే
(॥విన॥)
అంటకుముట్టకుమని యానలెల్లాఁబెట్టేవు
యింటిలో మీ చయ్యాటా లేరీతివే
వొంటినుండి మీలో మీరు వొద్దికై వేఁడుకొనేరు
దంటలై మీరాడినపంతము లెటువంటివే
(॥విన॥)
కన్ను సన్నలుగఁ దారుఖాణలకుఁ జొక్కేవు
మన్నించి నిన్నెటువలె మరిగించెనే
యెన్నఁగా శ్రీవేంకటేశు నెనసి పెండ్లాడితివి
అన్నిటా మీసమరతు లవి యెటువంటివే
(||pallavi||)
vinaveḍugayyī māgu viṁtaviṁta mī suddulu
manasu lŏkkaḍigānu māgu nĕṟim̐giṁchave
(||vina||)
sĕlarem̐gisĕlarem̐gi sĕlavula navvevu
yĕlami nādam̐ḍu ninnu nemisesĕne
balimi nūragĕ nīvu palumārum̐ bĕnam̐gevu
alarinamīsĕnagu avi yĕḍuvaṁṭive
(||vina||)
aṁṭagumuṭṭagumani yānalĕllām̐bĕṭṭevu
yiṁṭilo mī sayyāḍā lerīdive
vŏṁṭinuṁḍi mīlo mīru vŏddigai vem̐ḍugŏneru
daṁṭalai mīrāḍinabaṁtamu lĕḍuvaṁṭive
(||vina||)
kannu sannalugam̐ dārukhāṇalagum̐ jŏkkevu
manniṁchi ninnĕḍuvalĕ marigiṁchĕne
yĕnnam̐gā śhrīveṁkaḍeśhu nĕnasi pĕṁḍlāḍidivi
anniḍā mīsamaradu lavi yĕḍuvaṁṭive