Vinave naabuddi yimka velamdi

వినవే నాబుద్ది యిఁక వెలఁది
Language

(॥పల్లవి॥)
వినవే నాబుద్ది యిఁక వెలఁది
వొనరి యాతఁడు నీవూ నుండవే యీ కొలఁది

(॥విన॥)
చన్నులపై జారె నవె సరులు
వున్నతి రాలీఁ గోప్పలోనున్నవిరులు
మిన్నక నిండెఁగదె నీమేన గురులు
యెనఁడులేనిది యింత యేలే యీమరులు

(॥విన॥)
రాసికెక్కఁ గదె యీకరతలు
యీసమంతైనా వొద్దే యీవెతలు
లాసి చాఁచేవేలే బహులతలు
మోసపోకు మన్నిటికి మూలమే యీకతలు

(॥విన॥)
ముంచి తగులములకు మొదలు
అంచెల నలిగితేను అదవదలు
పొంచి వలసితేఁ గదుఁబొదలు
కొంచక శ్రీవేంకటేశుఁగూడిన సంపదలు

(||pallavi||)
vinave nābuddi yim̐ka vĕlam̐di
vŏnari yādam̐ḍu nīvū nuṁḍave yī kŏlam̐di

(||vina||)
sannulabai jārĕ navĕ sarulu
vunnadi rālīm̐ goppalonunnavirulu
minnaga niṁḍĕm̐gadĕ nīmena gurulu
yĕnam̐ḍulenidi yiṁta yele yīmarulu

(||vina||)
rāsigĕkkam̐ gadĕ yīgaradalu
yīsamaṁtainā vŏdde yīvĕdalu
lāsi sām̐sevele bahuladalu
mosabogu manniḍigi mūlame yīgadalu

(||vina||)
muṁchi tagulamulagu mŏdalu
aṁchĕla naligidenu adavadalu
pŏṁchi valasidem̐ gadum̐bŏdalu
kŏṁchaga śhrīveṁkaḍeśhum̐gūḍina saṁpadalu