Vinaramma yee suddulu velamdulaala

వినరమ్మ యీ సుద్దులు వెలఁదులాల
Language

(॥పల్లవి॥)
వినరమ్మ యీ సుద్దులు వెలఁదులాల
కొనబుకాఁడు గదమ్మ గోవిందరాజు

(॥విన॥)
వీడెము లందియ్యఁగాను వింజామరలు వేయఁగా
వోడక చెలులు పాదాలొత్తఁగాను
మేడలోనఁ బవళించి మెత్తనిపరపుమీఁద
కోడెసేఁతలు సేసీని గోవిందరాజు

(॥విన॥)
అట్టె నాట్యములాడఁగ అంకించిపాడఁగాను
ఇట్టునట్టు వీణలు వాఇంచఁగాను
వొట్టుక మలఁగుమీఁద నొడ్డోలగమై యున్నాఁడు
గుట్టుతోడివాఁడుగదె గోవిందరాజు

(॥విన॥)
పరిమళాలు పూయఁగ పలువిందులు వెట్టఁగ
సిరియు భూమియుఁ బెండ్లిసేస చల్లఁగా
తిరుపతిలోన నొద్దిక శ్రీవేంకటేశుఁడై
గొరబై నవ్వీఁగదె గోవిందరాజు

(||pallavi||)
vinaramma yī suddulu vĕlam̐dulāla
kŏnabugām̐ḍu gadamma goviṁdarāju

(||vina||)
vīḍĕmu laṁdiyyam̐gānu viṁjāmaralu veyam̐gā
voḍaga sĕlulu pādālŏttam̐gānu
meḍalonam̐ bavaḽiṁchi mĕttanibarabumīm̐da
koḍĕsem̐talu sesīni goviṁdarāju

(||vina||)
aṭṭĕ nāṭyamulāḍam̐ga aṁkiṁchibāḍam̐gānu
iṭṭunaṭṭu vīṇalu vāiṁcham̐gānu
vŏṭṭuga malam̐gumīm̐da nŏḍḍolagamai yunnām̐ḍu
guṭṭudoḍivām̐ḍugadĕ goviṁdarāju

(||vina||)
parimaḽālu pūyam̐ga paluviṁdulu vĕṭṭam̐ga
siriyu bhūmiyum̐ bĕṁḍlisesa sallam̐gā
tirubadilona nŏddiga śhrīveṁkaḍeśhum̐ḍai
gŏrabai navvīm̐gadĕ goviṁdarāju