వినరమ్మ చెలులాల వేడుక లివిన్నియును
(॥పల్లవి॥)
వినరమ్మ చెలులాల వేడుక లివిన్నియును
ఘనమైన వలపులు కడు లాబమాయను
(॥విన॥)
ముత్తెపుఁ జెమటలెల్లా ముంచి ఏరులైపారె
బత్తితోడి పులకలపైరు లెక్కె
కొత్తకొత్త వయసుల కోరికలు పాలుకొనె
హత్తిన వలపులెంత అగ్గువ లౌనో
(॥విన॥)
మొగములోని కళలు మొనసిరాసులాయ
తెగని సంతోసాల గాదెలు నిండెను
అగపడ్డసరసము లామనిపై నామనాయ
తగిలి వలపులెంత దారణగలుగునో
(॥విన॥)
అచ్చమైన కాఁగిళ్లు అంగళ్లు ముంగిళ్ళునిండె
ముచ్చట చెనకులనే లచ్చెనలాయ
యిచ్చట శ్రీవేంకటేశుఁ డింతలు నిట్టెకూడె
పెచ్చురేఁగి వలపుల చేరా లెంత యెచ్చునో
(||pallavi||)
vinaramma sĕlulāla veḍuga livinniyunu
ghanamaina valabulu kaḍu lābamāyanu
(||vina||)
muttĕbum̐ jĕmaḍalĕllā muṁchi erulaibārĕ
battidoḍi pulagalabairu lĕkkĕ
kŏttagŏtta vayasula korigalu pālugŏnĕ
hattina valabulĕṁta agguva launo
(||vina||)
mŏgamuloni kaḽalu mŏnasirāsulāya
tĕgani saṁtosāla gādĕlu niṁḍĕnu
agabaḍḍasarasamu lāmanibai nāmanāya
tagili valabulĕṁta dāraṇagaluguno
(||vina||)
achchamaina kām̐giḽlu aṁgaḽlu muṁgiḽḽuniṁḍĕ
muchchaḍa sĕnagulane lachchĕnalāya
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalu niṭṭĕgūḍĕ
pĕchchurem̐gi valabula serā lĕṁta yĕchchuno