Vinamgadave selula vinnabamu limkanaina

వినఁగదవే చెలుల విన్నపము లిఁకనైన
Language

(॥పల్లవి॥)
వినఁగదవే చెలుల విన్నపము లిఁకనైన
మనసిచ్చి నీకాతఁడు మరిగినాఁడిపుడు

(॥వినఁ॥)
సిగ్గులకుఁ దుదయేది చేయిచాఁచఁ గదవే
వొగ్గి విడమిచ్చీ నాతఁ డొడిఁబెట్టుక
కగ్గివున్న దెల్లఁ దేరెకన్నుల మొక్కఁగదవే
అగ్గలమై నీకు నాతఁడాసపడీ నిపుడు

(॥వినఁ॥)
గుట్టుసేయ నెడయేది కొంగు వొడ్డఁగదవే
వొట్టి సొమ్ములిచ్చీ నాతఁ డొడిఁబెట్టుక
చిట్టకములెల్ల మానె చివియొగ్గఁ గదవే
అగ్గలమై నీకు నతఁ డాసపడీ నిపుడు

(॥వినఁ॥)
తప్పించుకోఁ బనిలేదు కొప్పు వంచఁగదవే
వొప్పుగఁ బువ్వులు నించీ నొడిఁబెట్టుక
తప్పు లిన్నియునుఁ బాసె తగిలి మోవియ్యఁగదే
ఇప్పాట శ్రీవేంకటేశుఁ డేలె నిన్ను నిపుడు

(||pallavi||)
vinam̐gadave sĕlula vinnabamu lim̐kanaina
manasichchi nīgādam̐ḍu mariginām̐ḍibuḍu

(||vinam̐||)
siggulagum̐ dudayedi seyisām̐sam̐ gadave
vŏggi viḍamichchī nādam̐ ḍŏḍim̐bĕṭṭuga
kaggivunna dĕllam̐ derĕgannula mŏkkam̐gadave
aggalamai nīgu nādam̐ḍāsabaḍī nibuḍu

(||vinam̐||)
guṭṭuseya nĕḍayedi kŏṁgu vŏḍḍam̐gadave
vŏṭṭi sŏmmulichchī nādam̐ ḍŏḍim̐bĕṭṭuga
siṭṭagamulĕlla mānĕ siviyŏggam̐ gadave
aggalamai nīgu nadam̐ ḍāsabaḍī nibuḍu

(||vinam̐||)
tappiṁchugom̐ baniledu kŏppu vaṁcham̐gadave
vŏppugam̐ buvvulu niṁchī nŏḍim̐bĕṭṭuga
tappu linniyunum̐ bāsĕ tagili moviyyam̐gade
ippāḍa śhrīveṁkaḍeśhum̐ ḍelĕ ninnu nibuḍu