Vimtivade yeedani vesaala sudlulu nemdu

వింటివటే యీతని వేసాల సుద్లులు నేఁడు
Language

(॥పల్లవి॥)
వింటివటే యీతని వేసాల సుద్లులు నేఁడు
అంటే ననరాదుగాని ఆగడీఁడు గదవే

(॥వింటి॥)
ఇంటికి వచ్చినాఁడు నా ఇచ్చలోనే వుండుఁగాక
నంటున వింతవారితో నవ్వఁగనేలే
జంటవాయుకున్నవాఁడు చనవెల్లా నిచ్చుఁగాక
వొంటి వేరొకతెఁ జూపి వొట్టువెట్టనేలే

(॥వింటి॥)
మొగము చూచినవాఁడు ముచ్చటలాడుటగాక
తగ నచ్చటిపొందీడఁ దలఁచనేలే
మిగులాఁ జుట్టపువాఁడు మేలువాడై యుండుఁగాక
జగములో నాకోరిక సరి యెంచనేలే

(॥వింటి॥)
నాతో మాఁటాడినవాఁడు నన్ను నిట్టె యేలుఁగాక
యేతుల నాపెచే పంతమిప్పించనేలే
యీతల శ్రీవేంకటేశుఁ డింత మన్నించినవాఁడు
చేతికి లోనవుఁగాక సిబ్బతి మరేలే

(||pallavi||)
viṁṭivaḍe yīdani vesāla sudlulu nem̐ḍu
aṁṭe nanarādugāni āgaḍīm̐ḍu gadave

(||viṁṭi||)
iṁṭigi vachchinām̐ḍu nā ichchalone vuṁḍum̐gāga
naṁṭuna viṁtavārido navvam̐ganele
jaṁṭavāyugunnavām̐ḍu sanavĕllā nichchum̐gāga
vŏṁṭi verŏgadĕm̐ jūbi vŏṭṭuvĕṭṭanele

(||viṁṭi||)
mŏgamu sūsinavām̐ḍu muchchaḍalāḍuḍagāga
taga nachchaḍibŏṁdīḍam̐ dalam̐sanele
migulām̐ juṭṭabuvām̐ḍu meluvāḍai yuṁḍum̐gāga
jagamulo nāgoriga sari yĕṁchanele

(||viṁṭi||)
nādo mām̐ṭāḍinavām̐ḍu nannu niṭṭĕ yelum̐gāga
yedula nābĕse paṁtamippiṁchanele
yīdala śhrīveṁkaḍeśhum̐ ḍiṁta manniṁchinavām̐ḍu
sedigi lonavum̐gāga sibbadi marele