Vimtivade maguvaa vibhumdu neevu numdamgaam

వింటివటె మగువా విభుఁడు నీవు నుండఁగాఁ
Language

(॥పల్లవి॥)
వింటివటె మగువా విభుఁడు నీవు నుండఁగాఁ
గంటి మీ సొబగులెల్లా గక్కన మీయందునే

(॥వింటి॥)
తలపోఁతలే పండుగ తరితీపులే వేడుక
పిలుపులే చెప్పరాని ప్రియములు
సొలపులే పాయరానిచుటరికపుఁ జేఁతలు
చెలులకుఁ బతులకుఁ జెప్పరానిచవులు

(॥వింటి॥)
ననుపులే నిధానాలు నగవులే నిచ్చపంట
పెనగొన్నసరసాలే పెనువిందులు
తనివొనిచెనకులు తరగనిధాన్యాలు
యెనసినదంపతుల కెంచరానిచవులు

(॥వింటి॥)
ముచ్చటలే సంపదలు మోముచూపులే భాగ్యము
విచ్చనవిడిరతులే వింతసొమ్ములు
యిచ్చట శ్రీవేంకటేశుఁ డీతఁ డిట్టె నిన్ను నేలె
నిచ్చలు మీలోమీకు నిండుకొన్నచవులు

(||pallavi||)
viṁṭivaḍĕ maguvā vibhum̐ḍu nīvu nuṁḍam̐gām̐
gaṁṭi mī sŏbagulĕllā gakkana mīyaṁdune

(||viṁṭi||)
talabom̐tale paṁḍuga taridībule veḍuga
pilubule sĕpparāni priyamulu
sŏlabule pāyarānisuḍarigabum̐ jem̐talu
sĕlulagum̐ badulagum̐ jĕpparānisavulu

(||viṁṭi||)
nanubule nidhānālu nagavule nichchabaṁṭa
pĕnagŏnnasarasāle pĕnuviṁdulu
tanivŏnisĕnagulu taraganidhānyālu
yĕnasinadaṁpadula kĕṁcharānisavulu

(||viṁṭi||)
muchchaḍale saṁpadalu momusūbule bhāgyamu
vichchanaviḍiradule viṁtasŏmmulu
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṭṭĕ ninnu nelĕ
nichchalu mīlomīgu niṁḍugŏnnasavulu