Vimtivaa naamaada neevu vibhumdavu

వింటివా నామాట నీవు విభుఁడవు
Language

(॥పల్లవి॥)
వింటివా నామాట నీవు విభుఁడవు
నంటు నీవు చూపకున్నను నగుఁబాటౌను

(॥వింటి॥)
యెలమి నాపె నీపై నెంతమోహమోకాని
మలసి మలసి నీతో మాటలాడీని
కలసి మెలసినీవు కడులాలించకుంటేను
నెలకొన్న నేరమినీవొళ్లిదే అందురు

(॥వింటి॥)
మదిలోన నీకెంతమరిగినదో కాని
పొదిగి పొదిగి నీతో పొందుసేసీని
అదెరిఁగి నీవిప్పు డాకెఁ గూడకుండితేను
గుదిగొన్న మేలాన కూళతన మందురు

(॥వింటి॥)
యెనసి ఇంతి నీరతి(ని) యెట్టు గూడితివో కాని
తనిసి తనిసి నిన్నుఁ దగ మెచ్చీని
ఘనుఁడ శ్రీవేంకటేశ కరుణ యింతగాకున్న
చనవరితనాననకు చపచపనందురు

(||pallavi||)
viṁṭivā nāmāḍa nīvu vibhum̐ḍavu
naṁṭu nīvu sūbagunnanu nagum̐bāḍaunu

(||viṁṭi||)
yĕlami nābĕ nībai nĕṁtamohamogāni
malasi malasi nīdo māḍalāḍīni
kalasi mĕlasinīvu kaḍulāliṁchaguṁṭenu
nĕlagŏnna neraminīvŏḽlide aṁduru

(||viṁṭi||)
madilona nīgĕṁtamariginado kāni
pŏdigi pŏdigi nīdo pŏṁdusesīni
adĕrim̐gi nīvippu ḍāgĕm̐ gūḍaguṁḍidenu
gudigŏnna melāna kūḽadana maṁduru

(||viṁṭi||)
yĕnasi iṁti nīradi(ni) yĕṭṭu gūḍidivo kāni
tanisi tanisi ninnum̐ daga mĕchchīni
ghanum̐ḍa śhrīveṁkaḍeśha karuṇa yiṁtagāgunna
sanavaridanānanagu sabasabanaṁduru