Vimti nem gonni suddulu veeri vaari sedanellaa

వింటి నేఁ గొన్ని సుద్దులు వీరి వారి చేతనెల్లా
Language

(॥పల్లవి॥)
వింటి నేఁ గొన్ని సుద్దులు వీరి వారి చేతనెల్లా
నంటున నానతీవయ్యా నాతో నేఁడు

(॥వింటి॥)
చెలరేఁగి చెలరేఁగి సేసె నాపె విన్నపాలు
వెలయఁగఁ జెవులార వింటివా నీవు
చలువగా వలపులు చల్లుతా గొలువు సేసె
తలఁపెల్లా నిందువంకఁ దనివందెనా

(॥వింటి॥)
తమిరేఁచి తమ(మి?) రేఁచి తా నీకుఁ బాదము లొతై
అమరఁ జుట్టరికము లబ్బెనా నీకు
తిమురుచు సన్నలనే తియ్యనిమోవి చూపె
సమమోహముల నీకుఁ జవులాయనా

(॥వింటి॥)
కరఁగించి కరఁగించి కాఁగిట సేవలుసేసె
ఇరవుగా నన్నియును నియ్యకొంటివిగా
గరిమ సేలితివి గక్కన శ్రీవేంకటేశ
తొరలించి యాపె పొందు దొరకెనా నేఁడు

(||pallavi||)
viṁṭi nem̐ gŏnni suddulu vīri vāri sedanĕllā
naṁṭuna nānadīvayyā nādo nem̐ḍu

(||viṁṭi||)
sĕlarem̐gi sĕlarem̐gi sesĕ nābĕ vinnabālu
vĕlayam̐gam̐ jĕvulāra viṁṭivā nīvu
saluvagā valabulu salludā gŏluvu sesĕ
talam̐pĕllā niṁduvaṁkam̐ danivaṁdĕnā

(||viṁṭi||)
tamirem̐si tama(mi?) rem̐si tā nīgum̐ bādamu lŏdai
amaram̐ juṭṭarigamu labbĕnā nīgu
timurusu sannalane tiyyanimovi sūbĕ
samamohamula nīgum̐ javulāyanā

(||viṁṭi||)
karam̐giṁchi karam̐giṁchi kām̐giḍa sevalusesĕ
iravugā nanniyunu niyyagŏṁṭivigā
garima selidivi gakkana śhrīveṁkaḍeśha
tŏraliṁchi yābĕ pŏṁdu dŏragĕnā nem̐ḍu