వింటేఁ గోపమురేఁగీ విన్నవారికి
(॥పల్లవి॥)
వింటేఁ గోపమురేఁగీ విన్నవారికి
దంటవౌదు వన్నిటాను తడవకు మిఁకను
(॥వింటేఁ॥)
మొగమోటలోనున్నది మోహము
నగినందులో నున్నది నను పెల్లాను
చిగురుబాసలు నాకుఁ జేయనేఁటికి నీకే
తగునా సుద్దులు మరి తడవకు మిఁకను
(॥వింటేఁ॥)
దట్టపుఁ జూపులలో నుంది తగులెల్లాను
గుట్టులోపల నున్నది గుణమెల్లాను
అట్టె మాతోనేల ఆనలు
దట్టమాయ నీవేసాలు తడవకు మిఁకను
(॥వింటేఁ॥)
కూడినందులో నున్నది కోరికె మాట
జాడలలోనే వున్నది చనవెల్లాను
యీడనె నన్ను శ్రీ వేంకటేశ కూడితి
తాడుమీఁది తపసులు తడవకుమిఁకను
(||pallavi||)
viṁṭem̐ gobamurem̐gī vinnavārigi
daṁṭavaudu vanniḍānu taḍavagu mim̐kanu
(||viṁṭem̐||)
mŏgamoḍalonunnadi mohamu
naginaṁdulo nunnadi nanu pĕllānu
sigurubāsalu nāgum̐ jeyanem̐ṭigi nīge
tagunā suddulu mari taḍavagu mim̐kanu
(||viṁṭem̐||)
daṭṭabum̐ jūbulalo nuṁdi tagulĕllānu
guṭṭulobala nunnadi guṇamĕllānu
aṭṭĕ mādonela ānalu
daṭṭamāya nīvesālu taḍavagu mim̐kanu
(||viṁṭem̐||)
kūḍinaṁdulo nunnadi korigĕ māḍa
jāḍalalone vunnadi sanavĕllānu
yīḍanĕ nannu śhrī veṁkaḍeśha kūḍidi
tāḍumīm̐di tabasulu taḍavagumim̐kanu