Vimtavaaru ninnemannaa vinamjaalamu

వింతవారు నిన్నేమన్నా వినఁజాలము
Language

(॥పల్లవి॥)
వింతవారు నిన్నేమన్నా వినఁజాలము
మంతుకు బదుకవయ్య మాకు సెలవుగను

(॥వింత॥)
చెక్కులును నొక్కితివి సేసలునుఁ జల్లితివి
యెక్కువైతి మింక మాకు నేమి గొరత
దిక్కుల సతులు నిన్ను దీవించేటట్టు గాను
మక్కువ బతుకు నీవు మాకు సెలవుగను

(॥వింత॥)
సెలవుల నవ్వితివి చేయి మాపై వేసితివి
చెలఁగితి మిఁక మాకు చింత యేడది
చెలిమి సేసినవారు చేయెత్తి మొక్కేయట్టుగ
మలసి బతుకవయ్య మాకు సెలవుగను

(॥వింత॥)
కందువలు చూపితివి కాఁగిటనుఁ గూడితివి
అంది యలమేల్మంగను అక్కర లేదు
ఇందునే శ్రీ వేంకటేశ యిరుగుపొరుగు వారి
మందలించి బతుకుమీ మాకు సెలవుగను

(||pallavi||)
viṁtavāru ninnemannā vinam̐jālamu
maṁtugu badugavayya māgu sĕlavuganu

(||viṁta||)
sĕkkulunu nŏkkidivi sesalunum̐ jallidivi
yĕkkuvaidi miṁka māgu nemi gŏrada
dikkula sadulu ninnu dīviṁcheḍaṭṭu gānu
makkuva badugu nīvu māgu sĕlavuganu

(||viṁta||)
sĕlavula navvidivi seyi mābai vesidivi
sĕlam̐gidi mim̐ka māgu siṁta yeḍadi
sĕlimi sesinavāru seyĕtti mŏkkeyaṭṭuga
malasi badugavayya māgu sĕlavuganu

(||viṁta||)
kaṁduvalu sūbidivi kām̐giḍanum̐ gūḍidivi
aṁdi yalamelmaṁganu akkara ledu
iṁdune śhrī veṁkaḍeśha yirugubŏrugu vāri
maṁdaliṁchi badugumī māgu sĕlavuganu