వింతవాఁడా తానేమి వేగిరించ నేమిటికి
(॥పల్లవి॥)
వింతవాఁడా తానేమి వేగిరించ నేమిటికి
చెంతనుండి యెప్పుడైనా సేవసేసే తనకు
(॥వింత॥)
సమ్మతించితేనే మాట చవులై యుండునే
ఇమ్ముల నేమనఁగాను యెట్టుండునో
కమ్మరఁ దానే వచ్చి కరుణించిణప్పుడయ్యీ
ముమ్మాఁటికి నీవేళ మొక్కేనే తనకు
(॥వింత॥)
తగులైన పొందులే తమకము రేఁచునే
మొగమిచ్చలెల్లా ప్రియములు రేఁచీనా
తగిలి నాయింటికి తానే వచ్చిన దాఁకా
పగటు మోహము జన్నెవట్టుకుండేఁ దనకు
(॥వింత॥)
పానుపుపై నుండితేనే పంతము లీడేరునే
నానినఁగాని కొంత నయమెక్కదు
తానే శ్రీవేంకటేశుఁడు తగఁ బేలకుర్తిలోన
పూని చెన్నుఁడై నన్నేలె పొంచుకుండేఁ దనకు
(||pallavi||)
viṁtavām̐ḍā tānemi vegiriṁcha nemiḍigi
sĕṁtanuṁḍi yĕppuḍainā sevasese tanagu
(||viṁta||)
sammadiṁchidene māḍa savulai yuṁḍune
immula nemanam̐gānu yĕṭṭuṁḍuno
kammaram̐ dāne vachchi karuṇiṁchiṇappuḍayyī
mummām̐ṭigi nīveḽa mŏkkene tanagu
(||viṁta||)
tagulaina pŏṁdule tamagamu rem̐sune
mŏgamichchalĕllā priyamulu rem̐sīnā
tagili nāyiṁṭigi tāne vachchina dām̐kā
pagaḍu mohamu jannĕvaṭṭuguṁḍem̐ danagu
(||viṁta||)
pānububai nuṁḍidene paṁtamu līḍerune
nāninam̐gāni kŏṁta nayamĕkkadu
tāne śhrīveṁkaḍeśhum̐ḍu tagam̐ belagurdilona
pūni sĕnnum̐ḍai nannelĕ pŏṁchuguṁḍem̐ danagu