వింతదాననా నేను నేమరు నింత సేయను
(॥పల్లవి॥)
వింతదాననా నేను నేమరు నింత సేయను
అంతరంగమే నేను అడ్డమాడ ననవే
(॥వింత॥)
తలపోఁతలేకావా తమకములు రేఁచేవి
చలములే కావా మతిసాదింపించేవి
నిలువు మొక్కులేకావా నివ్వెరగుఁ బొదించేవి
అలసితి నన్నాను అంతకోపననవే
(॥వింత॥)
సిగ్గరితనమేకాదా చేతికి లోను సేసేది
కగ్గనినవ్వులేకావా కాఁక రేఁచేవి
వొగ్గినమాఁటలేకావా వొడివట్టి తీయించేవి
అగ్గమై వుందాననిఁక సంతకోపననవే
(॥వింత॥)
కందువ చూపులేకావా కాఁగిటఁ బెనఁగించేవి
సందడి వలపేకాదా చవిసేసేది
యిందుకె శ్రీ వేంకటేశుఁడింటికి విచ్చేసి కూడె
అందమాయ వేఁడుకొనీ నంతకోపననవే
(||pallavi||)
viṁtadānanā nenu nemaru niṁta seyanu
aṁtaraṁgame nenu aḍḍamāḍa nanave
(||viṁta||)
talabom̐talegāvā tamagamulu rem̐sevi
salamule kāvā madisādiṁpiṁchevi
niluvu mŏkkulegāvā nivvĕragum̐ bŏdiṁchevi
alasidi nannānu aṁtagobananave
(||viṁta||)
siggaridanamegādā sedigi lonu sesedi
kagganinavvulegāvā kām̐ka rem̐sevi
vŏgginamām̐ṭalegāvā vŏḍivaṭṭi tīyiṁchevi
aggamai vuṁdānanim̐ka saṁtagobananave
(||viṁta||)
kaṁduva sūbulegāvā kām̐giḍam̐ bĕnam̐giṁchevi
saṁdaḍi valabegādā savisesedi
yiṁdugĕ śhrī veṁkaḍeśhum̐ḍiṁṭigi vichchesi kūḍĕ
aṁdamāya vem̐ḍugŏnī naṁtagobananave