Vimta vimta rusulane veduga vuttimchavale

వింత వింత రుచులనె వేడుక వుట్టించవలె
Language

(॥పల్లవి॥)
వింత వింత రుచులనె వేడుక వుట్టించవలె
ఇంతులనుఁ దోడుచూడు మిందు నొక్కొక్కతెనె

(॥వింత॥)
జాడల నీవెంత నాతో సరసము నెరపినా
ఆడినమాటలు సారె నాడరాదు
వాడికె రతులకును వడి నప్పణ ఇచ్చితే
కూడినట్లనె మరి కూడరాదు

(॥వింత॥)
సేసవెట్టి నీ వెన్నిసేవలు సేయించుకొన్నా
చేసిన సేఁతలు మరి సేయరాదు
మోసలేక నీవు మర్మములు గిలిగించితేను
రాసి నవ్వినట్టు మరి రతి నవ్వరాదు

(॥వింత॥)
యేచిన చక్కఁదనాన యెదుట నీ వుండితేను
చూచినట్లనె మరి చూడరాదు
చేచేత శ్రీవేంకటేశ చేకొని నన్నేలితివి
లాచి మెచ్చినట్లా వొల్లఁగె మెచ్చరాదు

(||pallavi||)
viṁta viṁta rusulanĕ veḍuga vuṭṭiṁchavalĕ
iṁtulanum̐ doḍusūḍu miṁdu nŏkkŏkkadĕnĕ

(||viṁta||)
jāḍala nīvĕṁta nādo sarasamu nĕrabinā
āḍinamāḍalu sārĕ nāḍarādu
vāḍigĕ radulagunu vaḍi nappaṇa ichchide
kūḍinaṭlanĕ mari kūḍarādu

(||viṁta||)
sesavĕṭṭi nī vĕnnisevalu seyiṁchugŏnnā
sesina sem̐talu mari seyarādu
mosalega nīvu marmamulu giligiṁchidenu
rāsi navvinaṭṭu mari radi navvarādu

(||viṁta||)
yesina sakkam̐danāna yĕduḍa nī vuṁḍidenu
sūsinaṭlanĕ mari sūḍarādu
seseda śhrīveṁkaḍeśha segŏni nannelidivi
lāsi mĕchchinaṭlā vŏllam̐gĕ mĕchcharādu