Vimduvu raavayyaa veduga neegum galigide

విందువు రావయ్యా వేడుక నీకుఁ గలిగితే
Language

(॥పల్లవి॥)
విందువు రావయ్యా వేడుక నీకుఁ గలిగితే
అంది తలఁచుకోవయ్యా ఆపె నీలో పొందులు

(॥విందు॥)
కొప్పు నిక్కఁ బెట్టుకొని గుబ్బలాఁడి యొక్కతె
అప్పటనుండి వాకిట నడిగీ నిన్ను
పిప్పిగట్ట విడేలు పెదవినిండాఁ జేసి
చెప్పీనదె నీ తన చిన్ననాటి సుద్దులు

(॥విందు॥)
కన్నులారుచుకొంటాను కతకారి తానొకతె
నిన్నుఁ జూడఁ దమకించీ నెయ్యముతోడ
చిన్ని చెక్కులవెంటాను చిప్పిల జవ్వాది గార
కిన్నెరలో వాయించీ మిక్కిలి నీపై చిందులు

(॥విందు॥)
వాడికమాఁటలులోడ వాకిలి దెరచుకొని
యీడకు వచ్చినది నీయెదుటికిని
కూడితివి నన్నుఁ దొల్లె గుట్టున శ్రీవేంకటేశ
వీడె మిచ్చి మేచ్చీ నిన్ను వింత వింత లాగులా

(||pallavi||)
viṁduvu rāvayyā veḍuga nīgum̐ galigide
aṁdi talam̐sugovayyā ābĕ nīlo pŏṁdulu

(||viṁdu||)
kŏppu nikkam̐ bĕṭṭugŏni gubbalām̐ḍi yŏkkadĕ
appaḍanuṁḍi vāgiḍa naḍigī ninnu
pippigaṭṭa viḍelu pĕdaviniṁḍām̐ jesi
sĕppīnadĕ nī tana sinnanāḍi suddulu

(||viṁdu||)
kannulārusugŏṁṭānu kadagāri tānŏgadĕ
ninnum̐ jūḍam̐ damagiṁchī nĕyyamudoḍa
sinni sĕkkulavĕṁṭānu sippila javvādi gāra
kinnĕralo vāyiṁchī mikkili nībai siṁdulu

(||viṁdu||)
vāḍigamām̐ṭaluloḍa vāgili dĕrasugŏni
yīḍagu vachchinadi nīyĕduḍigini
kūḍidivi nannum̐ dŏllĕ guṭṭuna śhrīveṁkaḍeśha
vīḍĕ michchi mechchī ninnu viṁta viṁta lāgulā