విచ్చి చెప్ప నెట్టు వచ్చు విరహుల గరిమలు
(॥పల్లవి॥)
విచ్చి చెప్ప నెట్టు వచ్చు విరహుల గరిమలు
కచ్చు పెట్టి తమ్ముఁ దామె కలయుటఁ గాక
(॥విచ్చి॥)
పట్టరానిది వయసు పాయరానిది కూటమి
నెట్టన దాఁచరానిది నిండు వలపు
గుట్టు లేనిది నగవు గురి లేనిది మనసు
యెట్టు వేగించఁగ వచ్చు నిఁక విరహులకు
(॥విచ్చి॥)
చెప్పఁగరానిది సిగ్గు చిక్కించరానిది బుద్ది
తప్పించుకోరానిది తగులాయము
తిప్పరానిది గుణము తెగరానిది మమత
అప్పటి నెట్టోర్వవచ్చునమ్మ విరహులకు
(॥విచ్చి॥)
పెంచరానిది యలుక బిగియరానిది పొందు
కొంచించరానిది తలకొన్న ననుపు
యెంచఁగ శ్రీవేంకటేశుఁ డీకె నిట్టె కూడెఁ గాక
వంచించి యెట్టు గెలువవచ్చు విరహులకు
(||pallavi||)
vichchi sĕppa nĕṭṭu vachchu virahula garimalu
kachchu pĕṭṭi tammum̐ dāmĕ kalayuḍam̐ gāga
(||vichchi||)
paṭṭarānidi vayasu pāyarānidi kūḍami
nĕṭṭana dām̐sarānidi niṁḍu valabu
guṭṭu lenidi nagavu guri lenidi manasu
yĕṭṭu vegiṁcham̐ga vachchu nim̐ka virahulagu
(||vichchi||)
sĕppam̐garānidi siggu sikkiṁcharānidi buddi
tappiṁchugorānidi tagulāyamu
tipparānidi guṇamu tĕgarānidi mamada
appaḍi nĕṭṭorvavachchunamma virahulagu
(||vichchi||)
pĕṁcharānidi yaluga bigiyarānidi pŏṁdu
kŏṁchiṁcharānidi talagŏnna nanubu
yĕṁcham̐ga śhrīveṁkaḍeśhum̐ ḍīgĕ niṭṭĕ kūḍĕm̐ gāga
vaṁchiṁchi yĕṭṭu gĕluvavachchu virahulagu