Vichcheyaraadaa velamdigadagu neevu

విచ్చేయరాదా వెలఁదికడకు నీవు
Language

(॥పల్లవి॥)
విచ్చేయరాదా వెలఁదికడకు నీవు
యిచ్చ నాసపడువారి నెలయించఁదగునా

(॥విచ్చే॥)
నిలిచి నిలిచి నీకు నిక్కి యెదురుచూచీని
వలచిన సతి నీవు వచ్చేవంటా
మలసి మలసి నీమాఁటలే ఆలకించీని
యెలమి నేమని యానతిత్తువో యనుచు

(॥విచ్చే॥)
చిమ్మి చిమ్మి నీయింటికి చేతులే చాఁచీని
తెమ్మల ఆసన్న నీవు తెలుతువంటా
కుమ్మరించి కుమ్మరించి గుట్టు మాని నవ్వీని
పమ్మి నీవు తలకొంగు పట్టుదువో యనుచు

(॥విచ్చే॥)
పూఁచి పూఁచి నీవద్దికి పొలఁతుల నంపీని
యేఁచక నీ విప్పుడిట్టె యేలుదువంటా
రేఁచి రేఁచి వలపులు రేసువాయఁ గూడితివి
దాఁచెను శ్రీవేంకటేశ తమక మేలనుచు

(||pallavi||)
vichcheyarādā vĕlam̐digaḍagu nīvu
yichcha nāsabaḍuvāri nĕlayiṁcham̐dagunā

(||vichche||)
nilisi nilisi nīgu nikki yĕdurusūsīni
valasina sadi nīvu vachchevaṁṭā
malasi malasi nīmām̐ṭale ālagiṁchīni
yĕlami nemani yānadittuvo yanusu

(||vichche||)
simmi simmi nīyiṁṭigi sedule sām̐sīni
tĕmmala āsanna nīvu tĕluduvaṁṭā
kummariṁchi kummariṁchi guṭṭu māni navvīni
pammi nīvu talagŏṁgu paṭṭuduvo yanusu

(||vichche||)
pūm̐si pūm̐si nīvaddigi pŏlam̐tula naṁpīni
yem̐saga nī vippuḍiṭṭĕ yeluduvaṁṭā
rem̐si rem̐si valabulu resuvāyam̐ gūḍidivi
dām̐sĕnu śhrīveṁkaḍeśha tamaga melanusu