Vichchanavidini yimka veedelu sesumgaani

విచ్చనవిడిని యిఁక వీడేలు సేసుఁగాని
Language

(॥పల్లవి॥)
విచ్చనవిడిని యిఁక వీడేలు సేసుఁగాని
రచ్చలఁబెట్టక యిఁక రమ్మనవే లోనికి

(॥॥)
పంతగాఁడైనవాఁడు పరపుపై నుండుఁగాక
ఇంతలోనే నావద్దకి యెట్టు వచ్చెనే
యెంతలేదె తనసుద్దు లిన్నియు నెఱుఁగుదును
రంతులు సేయక ఇట్టె రమ్మనవే లోనికి

(॥॥)
యేతులు నెరపేవాఁడు యేమీ ననకుండుఁగాక
యీతల మాతో మాట లేలాడీనే
చూతము తననేరుపు చుట్టులఁ బెట్టఁగనేల
రాతిరాయ నిఁకనైనా రమ్మనవే లోనికి

(॥॥)
దిట్ట యెంతవాఁడు తాను దేవర శ్రీవెంకటేశుఁ-
డెట్టు గూడెనె నను నిందరిలోన
అట్టె కానీవే తన ఆయము నేఁగన్నదే
రట్టుసేయ కిఁకనైనా రమ్మనవే లోనికి

(||pallavi||)
vichchanaviḍini yim̐ka vīḍelu sesum̐gāni
rachchalam̐bĕṭṭaga yim̐ka rammanave lonigi

(||||)
paṁtagām̐ḍainavām̐ḍu parabubai nuṁḍum̐gāga
iṁtalone nāvaddagi yĕṭṭu vachchĕne
yĕṁtaledĕ tanasuddu linniyu nĕṟum̐gudunu
raṁtulu seyaga iṭṭĕ rammanave lonigi

(||||)
yedulu nĕrabevām̐ḍu yemī nanaguṁḍum̐gāga
yīdala mādo māḍa lelāḍīne
sūdamu tananerubu suṭṭulam̐ bĕṭṭam̐ganela
rādirāya nim̐kanainā rammanave lonigi

(||||)
diṭṭa yĕṁtavām̐ḍu tānu devara śhrīvĕṁkaḍeśhum̐-
ḍĕṭṭu gūḍĕnĕ nanu niṁdarilona
aṭṭĕ kānīve tana āyamu nem̐gannade
raṭṭuseya kim̐kanainā rammanave lonigi