వేవేలు సతులుగల వేడుకకాఁడవు నీవు
(॥పల్లవి॥)
వేవేలు సతులుగల వేడుకకాఁడవు నీవు
దేవులఁ గనక నీకుఁ దెలిపితిఁ జుమ్మీ
(॥వేవే॥)
మంచిమాఁటలాడితేనే మగువలు చొక్కుదురు
పంచనలు సేతురు వలతురు
యించుకంత యెడసినా యెలయించి యెఁపినాను
కంచుఁబదనులవారు కామినులు సుమ్మీ
(॥వేవే॥)
చెక్కు నొక్కి వేఁడుకొంటే చెలులు గరఁగుదురు
మక్కువఁ గాఁగిలిత్తురు మరుగుదురు
కక్కసించి యేలినాను కపటాలు నెరపినా
వుక్కబదనులవారు వువిదలు సుమ్మీ
(॥వేవే॥)
తేజముతో నేలితేనే తెరవలు మొక్కుదురు
సాజాన సేవసేతురు సమ్మతింతురు
యీజాడ శ్రీవేంకటేశ యేలి తలమేల్మంగను
గాజుఁబదనులవారు కాంతులు సుమ్మీ
(||pallavi||)
vevelu sadulugala veḍugagām̐ḍavu nīvu
devulam̐ ganaga nīgum̐ dĕlibidim̐ jummī
(||veve||)
maṁchimām̐ṭalāḍidene maguvalu sŏkkuduru
paṁchanalu seduru valaduru
yiṁchugaṁta yĕḍasinā yĕlayiṁchi yĕm̐pinānu
kaṁchum̐badanulavāru kāminulu summī
(||veve||)
sĕkku nŏkki vem̐ḍugŏṁṭe sĕlulu garam̐guduru
makkuvam̐ gām̐gilitturu maruguduru
kakkasiṁchi yelinānu kabaḍālu nĕrabinā
vukkabadanulavāru vuvidalu summī
(||veve||)
tejamudo nelidene tĕravalu mŏkkuduru
sājāna sevaseduru sammadiṁturu
yījāḍa śhrīveṁkaḍeśha yeli talamelmaṁganu
gājum̐badanulavāru kāṁtulu summī