వేవేలు సతులు గల విభుఁడవు నీవైతే
(॥పల్లవి॥)
వేవేలు సతులు గల విభుఁడవు నీవైతే
యీవల మఱవకుండా నెఱిఁగించే నేను
(॥వేవే॥)
కన్నులచూపుల నవె కలకలనవ్వులు
చన్నుల తుదల నవె చవుకళింపులు
చిన్ని పెదవుల నవె చిప్పిలీవి తేనెలు
యిన్నిగుఱుతులుగల దెఱుఁగుకో యీకెను
(॥వేవే॥)
చెక్కులపైఁ దొలఁకేవి సేనాసేనకళలు
పిక్కటీల్లీ మోమునఁ జక్కఁదనము
అక్కజపు నడపుల నంచ లవె మెదలీని
యిక్కువలెల్లాఁ జూచుకో యీకెయందె నీవు
(॥వేవే॥)
కరమూలముల నవె కాఁగితలించేయాసలు
తిరమై దంతముల ముత్తేము లవిగో
అరుదుగా నేలితివి యందరిలో నీకెను
సిరిమించె మఱఁగెల శ్రీవేంకటేశ్వరా
(||pallavi||)
vevelu sadulu gala vibhum̐ḍavu nīvaide
yīvala maṟavaguṁḍā nĕṟim̐giṁche nenu
(||veve||)
kannulasūbula navĕ kalagalanavvulu
sannula tudala navĕ savugaḽiṁpulu
sinni pĕdavula navĕ sippilīvi tenĕlu
yinniguṟudulugala dĕṟum̐gugo yīgĕnu
(||veve||)
sĕkkulabaim̐ dŏlam̐kevi senāsenagaḽalu
pikkaḍīllī momunam̐ jakkam̐danamu
akkajabu naḍabula naṁcha lavĕ mĕdalīni
yikkuvalĕllām̐ jūsugo yīgĕyaṁdĕ nīvu
(||veve||)
karamūlamula navĕ kām̐gidaliṁcheyāsalu
tiramai daṁtamula muttemu lavigo
arudugā nelidivi yaṁdarilo nīgĕnu
sirimiṁchĕ maṟam̐gĕla śhrīveṁkaḍeśhvarā