Vevelagu neegu mokki vemdugonemu

వేవేలకు నీకు మొక్కి వేఁడుకొనేము
Language

(॥పల్లవి॥)
వేవేలకు నీకు మొక్కి వేఁడుకొనేము
చేవదేరె వలపులు చిత్తగించి రావయ్యా

(॥వేవే॥)
మంతనాలఁ గొంతసేఁపు మాఁటలనే కొంతఁసేపు
యెంత జోలిఁబెట్టేవు యేమయ్య
వంతుతో నిన్నుఁ బిలువవచ్చి తడవాయ నేము
ఇంతి నీకెదురుచూచీ నింటికి రావయ్యా

(॥వేవే॥)
నవ్వులనే కొంతసేఁపు నమ్మికలఁ గొంతసేఁపు
యివ్వల బరాకు నీకు నేమయ్య
నివ్వటిల్ల విన్నపాలు నీకిన్నయుఁ జేసితివి
జవ్వని గాచుకున్నది సరుగరావయ్యా

(॥వేవే॥)
మేలముఁ గొంత సేఁపు మేకులనే కొంతసేఁపు
యేలాటము లెంతచూపే వేమయ్య
మేలితివి శ్రీవేంకటేశ ఇంతలో వచ్చి
బాలను మన్నించి కలకాలము రావయ్యా

(||pallavi||)
vevelagu nīgu mŏkki vem̐ḍugŏnemu
sevaderĕ valabulu sittagiṁchi rāvayyā

(||veve||)
maṁtanālam̐ gŏṁtasem̐pu mām̐ṭalane kŏṁtam̐sebu
yĕṁta jolim̐bĕṭṭevu yemayya
vaṁtudo ninnum̐ biluvavachchi taḍavāya nemu
iṁti nīgĕdurusūsī niṁṭigi rāvayyā

(||veve||)
navvulane kŏṁtasem̐pu nammigalam̐ gŏṁtasem̐pu
yivvala barāgu nīgu nemayya
nivvaḍilla vinnabālu nīginnayum̐ jesidivi
javvani gāsugunnadi sarugarāvayyā

(||veve||)
melamum̐ gŏṁta sem̐pu megulane kŏṁtasem̐pu
yelāḍamu lĕṁtasūbe vemayya
melidivi śhrīveṁkaḍeśha iṁtalo vachchi
bālanu manniṁchi kalagālamu rāvayyā