Veshamu maarsenu

వేషము మార్చెను
Year
Language

పల్లవి:

వేషము మార్చెను... హోయ్!
భాషను మార్చెను... హోయ్!
మోసము నేర్చెనూ..ఉ..ఉ....
అసలు తానే మారెను...

అయినా మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు!
మనిషి మారలేదు
ఆతని మమత తీరలేదు!

చరణం 1:

కృరమృగమ్ముల కోరలు తీసెను
ఘోరారణ్యములాక్రమించెను ||2||

హిమాలయముపై జండా పాతెను ||2||
ఆకాశంలో షికారు చేసెను
అయినా మనిషి మారలేదు
ఆతని కాంక్ష తీరలేదు!

చరణం 2:

పిడికిలి మించని హృదయములో
కడలిని మించిన ఆశలు దాచెను ||2||
వేదికలెక్కెను, వాదము చేసెను, ||2||
త్యాగమె మేలని బోధలు చేసెను

అయినా మనిషి మారలేదు
ఆతని బాధ తీరలేదు!

చరణం 3:

వేషమూ మార్చెను, భాషనూ మార్చెను,
మోసము నేర్చెను, తలలే మార్చెను...
అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!

ఆ...ఆహహాహాహ ఆహాహహా...
ఓ... ఓహొహోహోహో ఓహోహొహో...

pallavi:

veṣhamu mārsĕnu... hoy!
bhāṣhanu mārsĕnu... hoy!
mosamu nersĕnū..u..u....
asalu tāne mārĕnu...

ayinā maniṣhi māraledu
ādani mamada tīraledu!
maniṣhi māraledu
ādani mamada tīraledu!

saraṇaṁ 1:

kṛramṛgammula koralu tīsĕnu
ghorāraṇyamulākramiṁchĕnu ||2||

himālayamubai jaṁḍā pādĕnu ||2||
āgāśhaṁlo ṣhigāru sesĕnu
ayinā maniṣhi māraledu
ādani kāṁkṣha tīraledu!

saraṇaṁ 2:

piḍigili miṁchani hṛdayamulo
kaḍalini miṁchina āśhalu dāsĕnu ||2||
vedigalĕkkĕnu, vādamu sesĕnu, ||2||
tyāgamĕ melani bodhalu sesĕnu

ayinā maniṣhi māraledu
ādani bādha tīraledu!

saraṇaṁ 3:

veṣhamū mārsĕnu, bhāṣhanū mārsĕnu,
mosamu nersĕnu, talale mārsĕnu...
ayinā maniṣhi māraledu, ādani mamada tīraledu!

ā...āhahāhāha āhāhahā...
o... ohŏhohoho ohohŏho...