వేసరని వలపుల విభుఁ డాతఁడు
(॥పల్లవి॥)
వేసరని వలపుల విభుఁ డాతఁడు
సేసపాలు మీఁదఁ జల్లి చెనకఁగరాదా
(॥వేస॥)
అరజాన దూరనేల ఆతని వేఁడుకోనేల
వూరకే దొరతనాన నుండఁగరాదా
మేరమీరి నవ్వనేల మిక్కిలిపంతమీనేల
నీరువంక తుంగవలె నెలకొనరాదా
(॥వేస॥)
యెగసక్కేలాడనేల యిచ్చకము సేయనేల
నగుతాఁ జుట్టరికమే నడపరాదా
వెగటై మెఱయనేల వినయము చూపనేల
చిగురులో చేఁగవలె చెలువొందరాదా
(॥వేస॥)
మనసు సోదించనేల మర్మములు చెప్పనేల
వొనగూడి రతులలో నోలాడరాదా
అనుగుశ్రీవేంకటేశుఁ డలమేలుమంగవు నీవు
వినుపులో నీడవలె నెలకొనరాదా
(||pallavi||)
vesarani valabula vibhum̐ ḍādam̐ḍu
sesabālu mīm̐dam̐ jalli sĕnagam̐garādā
(||vesa||)
arajāna dūranela ādani vem̐ḍugonela
vūrage dŏradanāna nuṁḍam̐garādā
meramīri navvanela mikkilibaṁtamīnela
nīruvaṁka tuṁgavalĕ nĕlagŏnarādā
(||vesa||)
yĕgasakkelāḍanela yichchagamu seyanela
nagudām̐ juṭṭarigame naḍabarādā
vĕgaḍai mĕṟayanela vinayamu sūbanela
sigurulo sem̐gavalĕ sĕluvŏṁdarādā
(||vesa||)
manasu sodiṁchanela marmamulu sĕppanela
vŏnagūḍi radulalo nolāḍarādā
anuguśhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁgavu nīvu
vinubulo nīḍavalĕ nĕlagŏnarādā