Veṟogadigaam joodagu veduga naa voodigamu

వేఱొకటిగాఁ జూడకు వేడుక నా వూడిగము
Language

(॥పల్లవి॥)
వేఱొకటిగాఁ జూడకు వేడుక నా వూడిగము
మీఱి నే విన్నవించి మెప్పించితి నిపుడు

(॥వేఱొ॥)
కోపగించుకోకుమీ గోరుదీసితినంటా
చేపట్టి రతెచ్చరిక సేసితినింతే
చాపలానఁ గసరకు చన్నుల నొత్తితినంటా
రాపాడి నీవురము సాంరించితి నిపుడు

(॥వేఱొ॥)
ముంచి యెగ్గుపట్టకుమీ మోవి గంటిసేసెనంటా
కొంచక బూవపుపొత్తు గూడితినింతే
పంచల జంకించకుమీ పట్టిపెనఁగినంటా
పెంచపునీసిగ్గు విడిపించితి నే నిపుడు

(॥వేఱొ॥)
గక్కున నలయకుమీ కాఁగిటఁ గూడితినంటా
పెక్కువిధముల మేలు పెంచితినింతే
పక్కన శ్రీవేంకటేశ పాయకుమీ దూరెనంటా
వెక్కసపునవ్వులు నవ్వితి నే నిపుడు

(||pallavi||)
veṟŏgaḍigām̐ jūḍagu veḍuga nā vūḍigamu
mīṟi ne vinnaviṁchi mĕppiṁchidi nibuḍu

(||veṟŏ||)
kobagiṁchugogumī gorudīsidinaṁṭā
sebaṭṭi radĕchchariga sesidiniṁte
sābalānam̐ gasaragu sannula nŏttidinaṁṭā
rābāḍi nīvuramu sāṁriṁchidi nibuḍu

(||veṟŏ||)
muṁchi yĕggubaṭṭagumī movi gaṁṭisesĕnaṁṭā
kŏṁchaga būvabubŏttu gūḍidiniṁte
paṁchala jaṁkiṁchagumī paṭṭibĕnam̐ginaṁṭā
pĕṁchabunīsiggu viḍibiṁchidi ne nibuḍu

(||veṟŏ||)
gakkuna nalayagumī kām̐giḍam̐ gūḍidinaṁṭā
pĕkkuvidhamula melu pĕṁchidiniṁte
pakkana śhrīveṁkaḍeśha pāyagumī dūrĕnaṁṭā
vĕkkasabunavvulu navvidi ne nibuḍu