వెఱవక లోనికి విచ్చేయవయ్యా
(॥పల్లవి॥)
వెఱవక లోనికి విచ్చేయవయ్యా
యెఱపరికము లాపె యేమిసేసీ నిఁకను
(॥వెఱ॥)
నగిన యందాఁకానే నాతుల కినుకలు
మొగము చూచుదాఁకానే ముంగోపాలు
తగిలినదాఁకానే తలపోఁతలిన్నియును
యెగసక్కే లాపె నిన్ను యేలాడీ నిఁకను
(॥వెఱ॥)
వొద్దికి వచ్చుదాఁకానే వొట్లును సత్యములు
ముద్దుమా టాఁడుదాఁకానే మొఱఁగులెల్లా
చద్దిమో విచ్చుదాఁనే సాదింపులన్నియును
ఇద్దెన మొక్కితే నాపె యేల తిట్టీ నిఁకను
(॥వెఱ॥)
వీడెమిచ్చుదాఁకానే వెక్కసములన్నియును
వాడికైనదాఁకానే వాసులెల్లాను
కూడితి యింతలోనే కూరిమి శ్రీవేంకటేశ
యీడనే వున్నాఁడ వాకె యేలదూరీ నిఁకను
(||pallavi||)
vĕṟavaga lonigi vichcheyavayyā
yĕṟabarigamu lābĕ yemisesī nim̐kanu
(||vĕṟa||)
nagina yaṁdām̐kāne nādula kinugalu
mŏgamu sūsudām̐kāne muṁgobālu
tagilinadām̐kāne talabom̐talinniyunu
yĕgasakke lābĕ ninnu yelāḍī nim̐kanu
(||vĕṟa||)
vŏddigi vachchudām̐kāne vŏṭlunu satyamulu
muddumā ṭām̐ḍudām̐kāne mŏṟam̐gulĕllā
saddimo vichchudām̐ne sādiṁpulanniyunu
iddĕna mŏkkide nābĕ yela tiṭṭī nim̐kanu
(||vĕṟa||)
vīḍĕmichchudām̐kāne vĕkkasamulanniyunu
vāḍigainadām̐kāne vāsulĕllānu
kūḍidi yiṁtalone kūrimi śhrīveṁkaḍeśha
yīḍane vunnām̐ḍa vāgĕ yeladūrī nim̐kanu