Veragayyee neesemtagu vitthaleshvaraa

వెరగయ్యీ నీచేఁతకు విట్ఠలేశ్వరా
Language

(॥పల్లవి॥)
వెరగయ్యీ నీచేఁతకు విట్ఠలేశ్వరా
విరులు చల్లే వప్పటి విట్ఠలేశ్వరా

(॥॥)
వేడుకకాఁడవు నీవు విట్ఠలేశ్వరా మాకు
వీడె మియ్యఁ గదవోయి విట్ఠలేశ్వరా
వీడవు మనపొందులు విట్ఠలేశ్వరా
వీడుదోడాడి వలపు విట్ఠలేశ్వరా

(॥॥)
వెన్న దిన్న నోరి తోడి విట్ఠలేశ్వరా
వెన్నెలనవ్వు నవ్వేవు విట్ఠలేశ్వరా
వెన్నుఁడ నీకు మొక్కేము విట్ఠలేశ్వరా మా-
విన్నపము లాలించు విట్ఠలేశ్వరా

(॥॥)
విచ్చేయు మాయింటికి విట్ఠలేశ్వరా యెంత
విచ్చి చెప్పేవు కతలు విట్ఠలేశ్వరా
కుచ్చి శ్రీ వేంకటాద్రిపైఁ గూడితివి నన్ను
విచ్చనవిడాయ నిఁక విట్ఠలేశ్వరా

(||pallavi||)
vĕragayyī nīsem̐tagu viṭṭhaleśhvarā
virulu salle vappaḍi viṭṭhaleśhvarā

(||||)
veḍugagām̐ḍavu nīvu viṭṭhaleśhvarā māgu
vīḍĕ miyyam̐ gadavoyi viṭṭhaleśhvarā
vīḍavu manabŏṁdulu viṭṭhaleśhvarā
vīḍudoḍāḍi valabu viṭṭhaleśhvarā

(||||)
vĕnna dinna nori toḍi viṭṭhaleśhvarā
vĕnnĕlanavvu navvevu viṭṭhaleśhvarā
vĕnnum̐ḍa nīgu mŏkkemu viṭṭhaleśhvarā mā-
vinnabamu lāliṁchu viṭṭhaleśhvarā

(||||)
vichcheyu māyiṁṭigi viṭṭhaleśhvarā yĕṁta
vichchi sĕppevu kadalu viṭṭhaleśhvarā
kuchchi śhrī veṁkaḍādribaim̐ gūḍidivi nannu
vichchanaviḍāya nim̐ka viṭṭhaleśhvarā