Veragamdi vunna daana vibhu nemee nanalega

వెరగంది వున్న దాన విభు నేమీ ననలేక
Language

(॥పల్లవి॥)
వెరగంది వున్న దాన విభు నేమీ ననలేక
చురచురఁ బంతాలాడీ చోద్యమయ్యీనే

(॥వెర॥)
చెక్కులఁ జెమట గారె సిగ్గులు మోమునఁదెరె
యెక్కడిమాటలు పతి నేమనేనే
పక్కులు గట్టెను మోవి పైకొనెఁ గన్నులకాని
తక్కక నాతో నింక తా నేమనీనే

(॥వెర॥)
నెఱులకొప్పు వదలె నిట్టూర్పులు పొదలె
యెఱిఁగి యుండియుఁ దను నేమనేనే
తఱచాయ నలపులు తతిగొనె వలపులు
వఱివచ్చె రతులకు తానేమనీనే

(॥వెర॥)
సెలవినవ్వులు మించెచిత్తము చెంగలించె
యెలమి శ్రీ వేంకటేశు నేమనేనే
నలి రేఁగి పందెమాడె నన్నుఁ గాఁగిటఁ గూడె
తలఁగరా దిఁక నెందూ తా నేమనీనే

(||pallavi||)
vĕragaṁdi vunna dāna vibhu nemī nanalega
surasuram̐ baṁtālāḍī sodyamayyīne

(||vĕra||)
sĕkkulam̐ jĕmaḍa gārĕ siggulu momunam̐dĕrĕ
yĕkkaḍimāḍalu padi nemanene
pakkulu gaṭṭĕnu movi paigŏnĕm̐ gannulagāni
takkaga nādo niṁka tā nemanīne

(||vĕra||)
nĕṟulagŏppu vadalĕ niṭṭūrbulu pŏdalĕ
yĕṟim̐gi yuṁḍiyum̐ danu nemanene
taṟasāya nalabulu tadigŏnĕ valabulu
vaṟivachchĕ radulagu tānemanīne

(||vĕra||)
sĕlavinavvulu miṁchĕsittamu sĕṁgaliṁchĕ
yĕlami śhrī veṁkaḍeśhu nemanene
nali rem̐gi paṁdĕmāḍĕ nannum̐ gām̐giḍam̐ gūḍĕ
talam̐garā dim̐ka nĕṁdū tā nemanīne