Venaga neevu seppinattu vinemgaani

వెనక నీవు చెప్పినట్టు వినేఁగాని
Language

(॥పల్లవి॥)
వెనక నీవు చెప్పినట్టు వినేఁగాని
ననిచి నాతో నంత నవ్వకుమీ విభుఁడా

(॥వెన॥)
అసము దించక మాఁటలాడేఁగాని నీతో
విసిగితి నీవిరహవేదనలను
రసికులైనవారు రామల నలఁగిఁచితే
పసురువేసీ నందరు పట్టికుమీ విభుఁడా

(॥వెన॥)
వీడనాడఁ జాలక నే వీడె మిచ్చేఁగాని నీకు
తాడుపడె నామనసు తమకానను
వేడుక కాఁడైనవాఁడు వెలఁదుల నేఁచితేను
గోడు దాఁకీ నందురు తక్కుల కోప విభుఁడా

(॥వెన॥)
గుట్టు మానలేక నీతోఁ గూడేఁగాని నేను
తొట్టీ నిట్టూర్పులు నీదొమ్మిరతుల
యిట్టె శ్రీవేంకటేశ యేలినవా రాఁడువారిఁ
పట్టుకు దయసేతురు పాయకుమీ విభుఁడా

(||pallavi||)
vĕnaga nīvu sĕppinaṭṭu vinem̐gāni
nanisi nādo naṁta navvagumī vibhum̐ḍā

(||vĕna||)
asamu diṁchaga mām̐ṭalāḍem̐gāni nīdo
visigidi nīvirahavedanalanu
rasigulainavāru rāmala nalam̐gim̐side
pasuruvesī naṁdaru paṭṭigumī vibhum̐ḍā

(||vĕna||)
vīḍanāḍam̐ jālaga ne vīḍĕ michchem̐gāni nīgu
tāḍubaḍĕ nāmanasu tamagānanu
veḍuga kām̐ḍainavām̐ḍu vĕlam̐dula nem̐sidenu
goḍu dām̐kī naṁduru takkula koba vibhum̐ḍā

(||vĕna||)
guṭṭu mānalega nīdom̐ gūḍem̐gāni nenu
tŏṭṭī niṭṭūrbulu nīdŏmmiradula
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelinavā rām̐ḍuvārim̐
paṭṭugu dayaseduru pāyagumī vibhum̐ḍā