Vemdugomgaam jelulado vitraveemge vimtegaaga

వేఁడుకోఁగాఁ జెలులతో విఱ్ఱవీఁగే వింతేకాక
Language

(॥పల్లవి॥)
వేఁడుకోఁగాఁ జెలులతో విఱ్ఱవీఁగే వింతేకాక
నేఁడాపె తానే వచ్చితే నీకేమన వచ్చును

(॥వేఁడు॥)
చలపాదితనములు సతులకు నింతేకాక
వలచినయట్టిమగవాని కేఁటికి
చెలరేఁగి యాపె నిన్ను చెనకి పైకొంటేను
నిలువున గరఁగక నీ వోర్వఁగలవా

(॥వేఁడు॥)
పనిమాలినవొట్లు పడఁతుల కింతే కాక
ననిచినయట్టిప్రాణనాథు కేఁటికి
మనసిచ్చి యాపె నీ మర్మములు ముట్టితేను
తనివోని తమకము దాఁచుకొనఁగలవా

(॥వేఁడు॥)
దిట్టతనపు మాటలు తెఱవల కింతేకాక
నెట్టన శ్రీవేంకటేశ నీకేఁటికి
గట్టిగా నిన్నాపె గూడి కాగిట నిట్టెవుండితె
గుట్టెల్లాఁ జెప్పక మతి బెట్టుకొనఁగలవా

(||pallavi||)
vem̐ḍugom̐gām̐ jĕlulado viṭravīm̐ge viṁtegāga
nem̐ḍābĕ tāne vachchide nīgemana vachchunu

(||vem̐ḍu||)
salabādidanamulu sadulagu niṁtegāga
valasinayaṭṭimagavāni kem̐ṭigi
sĕlarem̐gi yābĕ ninnu sĕnagi paigŏṁṭenu
niluvuna garam̐gaga nī vorvam̐galavā

(||vem̐ḍu||)
panimālinavŏṭlu paḍam̐tula kiṁte kāga
nanisinayaṭṭiprāṇanāthu kem̐ṭigi
manasichchi yābĕ nī marmamulu muṭṭidenu
tanivoni tamagamu dām̐sugŏnam̐galavā

(||vem̐ḍu||)
diṭṭadanabu māḍalu tĕṟavala kiṁtegāga
nĕṭṭana śhrīveṁkaḍeśha nīgem̐ṭigi
gaṭṭigā ninnābĕ gūḍi kāgiḍa niṭṭĕvuṁḍidĕ
guṭṭĕllām̐ jĕppaga madi bĕṭṭugŏnam̐galavā