Vellibode elaa manasaa edo alaa

వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా
Year
Language

పల్లవి:

వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా
అయినా.. ఎందుకనే ఇలా తడబాటు అంతలా
తెగ హుషారుగా ఎగిరిపోకే తగని ఊహ వెంట
సరైన దారి తెలియందే ఈ ఉరుకులెందుకంట
వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోతే ఎలా..

చరణం 1:

ఆ.. ఆ.. ఆ..

ఆమె వలలో చిక్కుకుందా సమయం
ప్రేమ లయలో దూకుతోందా హృదయం
నేనిప్పుడెక్కడున్నానంటే నాక్కూడా అంతు చిక్కకుంటే
గమ్మత్తుగానే ఉన్నదంటే నాకేదో మత్తు కమ్మినట్టే
ఊరురూరూ.. ఊఁ..ఊఁ.. ఊరురూరూ.. ఊఁ..ఊఁ..
రమ్మంది గాలి నను చేరి మెరుపు సైగ చేసి
చెప్పింది నింగి చెలిదారి చినుకు వంతెనేసి

వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా.. తతర తడతారతా..
వెళ్ళనంటే ఎలా ఎలా హే...

చరణం 2:

తాను కూడా రాకపోతే.. నాతో
నేను కూడా ఆగిపోనా.. తనతో
నా ప్రాణం ఉంది తన వెంటే
నా ఊపిరుంది తననంటే
కళ్ళారా చూశానంటూ ఉంటే
ఎలా నమ్మేది స్వప్నమంటే
ఊరురూరూ.. ఊఁ..ఊఁ.. ఊరురూరూ.. ఊఁ..ఊఁ..
వెనక్కి వెళ్ళి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని
మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని

వెళ్ళనంటే ఎలా.. ఊఁఊఁఊఁ.. మనసా అటే అలా
వెళ్ళనంటే ఎలా ఎలా హే...

pallavi:

vĕḽḽibode ĕlā manasā ĕḍo alā
ayinā.. ĕṁdugane ilā taḍabāḍu aṁtalā
tĕga huṣhārugā ĕgiriboge tagani ūha vĕṁṭa
saraina dāri tĕliyaṁde ī urugulĕṁdugaṁṭa
vĕḽḽibode ĕlā vĕḽḽibode ĕlā..

saraṇaṁ 1:

ā.. ā.. ā..

āmĕ valalo sikkuguṁdā samayaṁ
prema layalo dūgudoṁdā hṛdayaṁ
nenippuḍĕkkaḍunnānaṁṭe nākkūḍā aṁtu sikkaguṁṭe
gammattugāne unnadaṁṭe nāgedo mattu kamminaṭṭe
ūrurūrū.. ūm̐..ūm̐.. ūrurūrū.. ūm̐..ūm̐..
rammaṁdi gāli nanu seri mĕrubu saiga sesi
sĕppiṁdi niṁgi sĕlidāri sinugu vaṁtĕnesi

vĕḽḽanaṁṭe ĕlā manasā aḍe alā.. tadara taḍadāradā..
vĕḽḽanaṁṭe ĕlā ĕlā he...

saraṇaṁ 2:

tānu kūḍā rāgabode.. nādo
nenu kūḍā āgibonā.. tanado
nā prāṇaṁ uṁdi tana vĕṁṭe
nā ūbiruṁdi tananaṁṭe
kaḽḽārā sūśhānaṁṭū uṁṭe
ĕlā nammedi svapnamaṁṭe
ūrurūrū.. ūm̐..ūm̐.. ūrurūrū.. ūm̐..ūm̐..
vĕnakki vĕḽḽi vĕdagāli tirigi ā kṣhaṇānni
marŏkkasāri sūḍāli kanulu ā nijānni

vĕḽḽanaṁṭe ĕlā.. ūm̐ūm̐ūm̐.. manasā aḍe alā
vĕḽḽanaṁṭe ĕlā ĕlā he...