వెలయ నాగుణమెల్లా విన్నవించితి నీకు
(॥పల్లవి॥)
వెలయ నాగుణమెల్లా విన్నవించితి నీకు
చెలగి ఇందుకే సంతోసించుకొందు నేను
(॥వెల॥)
పట్టరానిమనసుతోఁ బదరి పై కొందుఁగాని
యెట్టునీవే మన్నించేది యెరుఁగుదును
నెట్టుకొన్నవేడుకతో నీకెదురుజూతుఁగాని
ఇట్టె నీవు వత్తువని యెంచుకొందు నేను
(॥వెల॥)
మోవరానివయసుతో ముంచి తమకింతుఁగాని
తావుకొని నన్నెలేది తలఁచి మెత్త
చేవదేరే కోరికతో చెలిచేఁ జెప్పింతుఁ గాని
నా వాఁడవనే నిన్ను నమ్ముకొందు నేను
(॥వెల॥)
చెప్పరాని యాసతోఁ జేరి కొసరుదుఁగాని
కప్పి నాపై వలపెల్లాఁ గనుఁగొంటివి
ఇపుడే శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
చొప్పైనయీగురుతులు చూచుకొందు నేను
(||pallavi||)
vĕlaya nāguṇamĕllā vinnaviṁchidi nīgu
sĕlagi iṁduge saṁtosiṁchugŏṁdu nenu
(||vĕla||)
paṭṭarānimanasudom̐ badari pai kŏṁdum̐gāni
yĕṭṭunīve manniṁchedi yĕrum̐gudunu
nĕṭṭugŏnnaveḍugado nīgĕdurujūdum̐gāni
iṭṭĕ nīvu vattuvani yĕṁchugŏṁdu nenu
(||vĕla||)
movarānivayasudo muṁchi tamagiṁtum̐gāni
tāvugŏni nannĕledi talam̐si mĕtta
sevadere korigado sĕlisem̐ jĕppiṁtum̐ gāni
nā vām̐ḍavane ninnu nammugŏṁdu nenu
(||vĕla||)
sĕpparāni yāsadom̐ jeri kŏsarudum̐gāni
kappi nābai valabĕllām̐ ganum̐gŏṁṭivi
ibuḍe śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
sŏppainayīgurudulu sūsugŏṁdu nenu