Velamdi yeege idigo veemdigo pemdligodugu

వెలఁది యీకె ఇదిగో వీఁడిగో పెండ్లికొడుకు
Language

(॥పల్లవి॥)
వెలఁది యీకె ఇదిగో వీఁడిగో పెండ్లికొడుకు
యెలమి నుపచారాలు ఇన్నియునుఁ జేయరే

(॥వెలఁ॥)
అంబుజపాణికిని హారములు గట్టరే
బింబాధరికిఁ గొప్పు వెట్టఁగదరే
కంబుకంఠికిని కప్రపు బొట్టు వెట్టరే
అంబరమధ్యకును ఆరతులు యెత్తరే

(॥వెలఁ॥)
కలువకంటికి మంచికాటుక వెట్టఁగదరే
తలిరుఁబోణికి పూలదండ వేయరే
మలయజగంధికి బొమ్మలపెండె మందియ్యరే
అలినీలవేణికి నట్టె సింగారించరే

(॥వెలఁ॥)
కరిగమనకును బాగాలు చేతి కొసఁగరే
హరిమధ్య కొడ్డాణ మమరించరే
ఇరవుగా శ్రీవేంకటేశ్వరునిఁ బెండ్లాడె
తరుణికి నితనికి తగు పీఁట వెట్టరే

(||pallavi||)
vĕlam̐di yīgĕ idigo vīm̐ḍigo pĕṁḍligŏḍugu
yĕlami nubasārālu inniyunum̐ jeyare

(||vĕlam̐||)
aṁbujabāṇigini hāramulu gaṭṭare
biṁbādharigim̐ gŏppu vĕṭṭam̐gadare
kaṁbugaṁṭhigini kaprabu bŏṭṭu vĕṭṭare
aṁbaramadhyagunu āradulu yĕttare

(||vĕlam̐||)
kaluvagaṁṭigi maṁchigāḍuga vĕṭṭam̐gadare
talirum̐boṇigi pūladaṁḍa veyare
malayajagaṁdhigi bŏmmalabĕṁḍĕ maṁdiyyare
alinīlaveṇigi naṭṭĕ siṁgāriṁchare

(||vĕlam̐||)
karigamanagunu bāgālu sedi kŏsam̐gare
harimadhya kŏḍḍāṇa mamariṁchare
iravugā śhrīveṁkaḍeśhvarunim̐ bĕṁḍlāḍĕ
taruṇigi nidanigi tagu pīm̐ṭa vĕṭṭare