Velamdi nimtade neevu vemdugovayyaa

వెలఁది నింతటే నీవు వేఁడుకోవయ్యా
Language

(॥పల్లవి॥)
వెలఁది నింతటే నీవు వేఁడుకోవయ్యా
యెలయింపుఁ జేతలు నేఁడివి యేలయ్యా

(॥వెలఁ॥)
మొగమోటమునఁ జెలి మొదలికోపము మాని
మగఁడవంటా నీతో మాటాడెఁగాని
అగడుసేసేనంటే అందు నెంతైనాఁ గద్దు
యెగసక్కే లింకాను నీవే లాడేవయ్యా

(॥వెలఁ॥)
ప్రియవాదిగన నీతోఁ బెనఁగి మారాడక
నయమచ్చి జలజాక్షి నవ్వెఁగాని
నియతి సాదించేనంటే నేరుపెంతైనాఁ గలదు
జయమాయ నిఁకనేల చల మింకానయ్యా

(॥వెలఁ॥)
యిచ్చకురాలై నిన్ను యెనసి శ్రీవేంకటేశ
మచ్చికసేసి యిఁ(యిం?)తి మరిగెఁగాని
పచ్చిసేసేనంటేను పగటెంతైనాఁ గద్దు
యిచ్చినచనవు లిట్టె యీడేరించవయ్యా

(||pallavi||)
vĕlam̐di niṁtaḍe nīvu vem̐ḍugovayyā
yĕlayiṁpum̐ jedalu nem̐ḍivi yelayyā

(||vĕlam̐||)
mŏgamoḍamunam̐ jĕli mŏdaligobamu māni
magam̐ḍavaṁṭā nīdo māḍāḍĕm̐gāni
agaḍusesenaṁṭe aṁdu nĕṁtainām̐ gaddu
yĕgasakke liṁkānu nīve lāḍevayyā

(||vĕlam̐||)
priyavādigana nīdom̐ bĕnam̐gi mārāḍaga
nayamachchi jalajākṣhi navvĕm̐gāni
niyadi sādiṁchenaṁṭe nerubĕṁtainām̐ galadu
jayamāya nim̐kanela sala miṁkānayyā

(||vĕlam̐||)
yichchagurālai ninnu yĕnasi śhrīveṁkaḍeśha
machchigasesi yim̐(yiṁ?)ti marigĕm̐gāni
pachchisesenaṁṭenu pagaḍĕṁtainām̐ gaddu
yichchinasanavu liṭṭĕ yīḍeriṁchavayyā