Velaleni gunamula vibhum daadamdu

వెలలేని గుణముల విభుఁ డాతఁడు
Language

(॥పల్లవి॥)
వెలలేని గుణముల విభుఁ డాతఁడు
సలిగెతనాల నెంత సాదించేవే

(॥వెల॥)
చన్నుల నోరసుకొంటా సణఁగుల నాతనితో
యేన్నేసిమాఁట లాడేవేమే నీవు
సన్నలనే మెవి చూపి సారె నోరూరించేవు
యిన్నేసివెడమాయ లేల సేసేవే

(॥వెల॥)
కాతరించి నవ్వుతాను గబ్బిచేఁతలెల్లాఁ జేసి
అతని నెంతగోసరే వౌనే నీవు
చేతులెత్తి మొక్కిమొక్కి చిత్తమెల్లాఁ గరఁగించి
యేతరితనాలనేల యెలయించేవే

(॥వెల॥)
నిక్కి నిక్కి మోముచూచి నేరువులు విచారించి
మిక్కిలి గాఁగిలించేవు మేలే నీవు
అక్కరో శ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవు నీవు
యిక్కువ లంటుచుఁ జెక్కులేల నోక్కేవే

(||pallavi||)
vĕlaleni guṇamula vibhum̐ ḍādam̐ḍu
saligĕdanāla nĕṁta sādiṁcheve

(||vĕla||)
sannula norasugŏṁṭā saṇam̐gula nādanido
yennesimām̐ṭa lāḍeveme nīvu
sannalane mĕvi sūbi sārĕ norūriṁchevu
yinnesivĕḍamāya lela seseve

(||vĕla||)
kādariṁchi navvudānu gabbisem̐talĕllām̐ jesi
adani nĕṁtagosare vaune nīvu
sedulĕtti mŏkkimŏkki sittamĕllām̐ garam̐giṁchi
yedaridanālanela yĕlayiṁcheve

(||vĕla||)
nikki nikki momusūsi neruvulu visāriṁchi
mikkili gām̐giliṁchevu mele nīvu
akkaro śhrīveṁkaḍeśhum̐ ḍalamel‌maṁgavu nīvu
yikkuva laṁṭusum̐ jĕkkulela nokkeve