Velainadaamkaa maa vididigim boyivachche

వేళైనదాఁకా మా విడిదికిఁ బోయివచ్చే
Language

(॥పల్లవి॥)
వేళైనదాఁకా మా విడిదికిఁ బోయివచ్చే
డాలుమీర సిగ్గులు వడఁగనేల యిఁకను

(॥వేళై॥)
కొలువులో నుండి చెలి కొసరి మాటాడఁగాను
కలకల నవ్వు నవ్వి కాఁగిలించేవు
తిలకించి యిద్దురును తెరవేసుకొనరాదా
వలవనిజోలి యీడ వద్దు వద్దు ఇఁకను

(॥వేళై॥)
యేకతాన నుండి యాపె యెగసక్కేలు సేయఁగా
దాకొని తొడలపైఁ బాదాలు చాఁచేవు
లోకులు మెచ్చఁగ మేడలోనికైనఁ బదరాదా
కైకొని పూరకుండఁ దగవు గాదు ఇఁకను

(॥వేళై॥)
గక్కన శ్రీవేంకటేశ కాంత నిన్నుఁ గూడఁగాను
ఇక్కడ నన్నేలితివి ఇంతలోననే
మక్కువ మీకు గలితే మా యింటికి రారాదా
పిక్కటిల్లీ వలపులు పెనఁగకు మిఁకను

(||pallavi||)
veḽainadām̐kā mā viḍidigim̐ boyivachche
ḍālumīra siggulu vaḍam̐ganela yim̐kanu

(||veḽai||)
kŏluvulo nuṁḍi sĕli kŏsari māḍāḍam̐gānu
kalagala navvu navvi kām̐giliṁchevu
tilagiṁchi yiddurunu tĕravesugŏnarādā
valavanijoli yīḍa vaddu vaddu im̐kanu

(||veḽai||)
yegadāna nuṁḍi yābĕ yĕgasakkelu seyam̐gā
dāgŏni tŏḍalabaim̐ bādālu sām̐sevu
logulu mĕchcham̐ga meḍalonigainam̐ badarādā
kaigŏni pūraguṁḍam̐ dagavu gādu im̐kanu

(||veḽai||)
gakkana śhrīveṁkaḍeśha kāṁta ninnum̐ gūḍam̐gānu
ikkaḍa nannelidivi iṁtalonane
makkuva mīgu galide mā yiṁṭigi rārādā
pikkaḍillī valabulu pĕnam̐gagu mim̐kanu