వెక్కసపు నీ కతలు విని విని వెగటయ్యీ
(॥పల్లవి॥)
వెక్కసపు నీ కతలు విని విని వెగటయ్యీ
యెక్కడెక్కడ నీ పగటు యెవ్వరిఁ బోలుదువే
(॥వెక్క॥)
ఆతఁడు నీ మగఁడనే వాలనైతి నీ వనేవు
యేతులేమి చెప్పేవే యిందరితోను
రాతిరిఁ బగ లీతని రతికిఁ గాచుకుండిన
యీ తరుణిమణులలో నెవురిఁ బోలుదువే
(॥వెక్క॥)
నిన్నుఁ బాయలేఁ డనేవు నీకు వలచు ననేవు
యెన్నిలేవే నీయాఁట వూడిగాలవారిలోన
వున్నతి నాతనివద్ది వూడుగాలవారిలోన
యెన్ని చెప్పే మంటే నీవు యెవురిఁ బోలుదువే
(॥వెక్క॥)
నీకు ననుచు ననేవు నీ వావులు దెలిపేవు
యీకడ నీ మేకులక నేది గురుతే
చేకొని న న్నేలినాఁడు శ్రీవేంకటేశ్వరుఁడు
యీ కులకాంతలలో నీ వెవ్వరిఁబోలుదువే
(||pallavi||)
vĕkkasabu nī kadalu vini vini vĕgaḍayyī
yĕkkaḍĕkkaḍa nī pagaḍu yĕvvarim̐ boluduve
(||vĕkka||)
ādam̐ḍu nī magam̐ḍane vālanaidi nī vanevu
yedulemi sĕppeve yiṁdaridonu
rādirim̐ baga līdani radigim̐ gāsuguṁḍina
yī taruṇimaṇulalo nĕvurim̐ boluduve
(||vĕkka||)
ninnum̐ bāyalem̐ ḍanevu nīgu valasu nanevu
yĕnnileve nīyām̐ṭa vūḍigālavārilona
vunnadi nādanivaddi vūḍugālavārilona
yĕnni sĕppe maṁṭe nīvu yĕvurim̐ boluduve
(||vĕkka||)
nīgu nanusu nanevu nī vāvulu dĕlibevu
yīgaḍa nī megulaga nedi gurude
segŏni na nnelinām̐ḍu śhrīveṁkaḍeśhvarum̐ḍu
yī kulagāṁtalalo nī vĕvvarim̐boluduve