Vegirimchi soosidenu virasamau valabellaa

వేగిరించి చూచితేను విరసమౌ వలపెల్లా
Language

(॥పల్లవి॥)
వేగిరించి చూచితేను విరసమౌ వలపెల్లా
బాగుగా నిచ్చకములే పచరించవలెను

(॥వేగి॥)
పతిచిత్త మెరిఁగి గొబ్బన మాటాడఁగవలె
హితవుచూచుక విడె మియ్యవలెను
తతి దెలుసుకొని యత్తరి సేవసేయవలెను
చతురతతో మెలఁగే జవరాలికి

(॥వేగి॥)
చనవిచ్చినప్పుడే సరసమాడఁగవలె
వొనరఁ జాంచితే పాదా లొత్తవలెను
విన నింపుగలిగితే విన్నపము సేయవలె
పెసఁగి పైకొనరాదు ప్రియురాలికి

(॥వేగి॥)
నాటినపొందులైతేను నవ్వులు నవ్వఁగవలె
చోటిచ్చితే పక్కనుండి చొక్కించవలె
యీటున శ్రీవేంకటేశ యిట్టి దలమేలుమంగ
కూటము లిట్టె చెల్లు గుణవంతురాలికి

(||pallavi||)
vegiriṁchi sūsidenu virasamau valabĕllā
bāgugā nichchagamule pasariṁchavalĕnu

(||vegi||)
padisitta mĕrim̐gi gŏbbana māḍāḍam̐gavalĕ
hidavusūsuga viḍĕ miyyavalĕnu
tadi dĕlusugŏni yattari sevaseyavalĕnu
saduradado mĕlam̐ge javarāligi

(||vegi||)
sanavichchinappuḍe sarasamāḍam̐gavalĕ
vŏnaram̐ jāṁchide pādā lŏttavalĕnu
vina niṁpugaligide vinnabamu seyavalĕ
pĕsam̐gi paigŏnarādu priyurāligi

(||vegi||)
nāḍinabŏṁdulaidenu navvulu navvam̐gavalĕ
soḍichchide pakkanuṁḍi sŏkkiṁchavalĕ
yīḍuna śhrīveṁkaḍeśha yiṭṭi dalamelumaṁga
kūḍamu liṭṭĕ sĕllu guṇavaṁturāligi