వేగిరించకురే మీరు వెలఁదులాలా
(॥పల్లవి॥)
వేగిరించకురే మీరు వెలఁదులాలా
పోగైన మంచిగుణాల బుద్దులవాఁ డతఁడు
(॥॥)
వలపించనేర్చునట వద్దికి రానేరఁడా
తలఁ పెందున్నదోకాక తనకు నేఁడు
మొలయించఁ గలఁడట యెనయఁ గలేఁడా
కలిగినతనబత్తి కందము గాక
(॥॥)
కొరి తెచ్చుకొన్నవాడు కూడుకొననేరఁడా
వూరికే పనిగలిగి వున్నాఁ డో కాక
వేరులేనిచుట్టరికమట విడెమంప మరిచీనా
తారుకాణలై మనకుఁ దానె వచ్చిఁ గాక
(॥॥)
మంచముపై కిట్టె వచ్చి మాఁటాలాడ నేరఁడా
యెంచుక నన్నెంతగా మన్నించీనోకాక
అంచెల శ్రీవేంకటేశుఁ డన్నిటాను నన్నుఁ గూడె
నించినయీపొందు లిట్టె నెరవేరీఁ గాక
(||pallavi||)
vegiriṁchagure mīru vĕlam̐dulālā
pogaina maṁchiguṇāla buddulavām̐ ḍadam̐ḍu
(||||)
valabiṁchanersunaḍa vaddigi rāneram̐ḍā
talam̐ pĕṁdunnadogāga tanagu nem̐ḍu
mŏlayiṁcham̐ galam̐ḍaḍa yĕnayam̐ galem̐ḍā
kaliginadanabatti kaṁdamu gāga
(||||)
kŏri tĕchchugŏnnavāḍu kūḍugŏnaneram̐ḍā
vūrige panigaligi vunnām̐ ḍo kāga
verulenisuṭṭarigamaḍa viḍĕmaṁpa marisīnā
tārugāṇalai managum̐ dānĕ vachchim̐ gāga
(||||)
maṁchamubai kiṭṭĕ vachchi mām̐ṭālāḍa neram̐ḍā
yĕṁchuga nannĕṁtagā manniṁchīnogāga
aṁchĕla śhrīveṁkaḍeśhum̐ ḍanniḍānu nannum̐ gūḍĕ
niṁchinayībŏṁdu liṭṭĕ nĕraverīm̐ gāga