Vegira memtigi naagu veyainaanu

వేగిర మేఁటికి నాకు వేయైనాను
Language

(॥పల్లవి॥)
వేగిర మేఁటికి నాకు వేయైనాను
చేగదేర నీవే దయసేసేవు గాక

(॥వేగి॥)
పంతాలు నీతో నేను పచారించే దాననా
పొంతపుఁ జూపులఁ జూచి గుడిసేఁ గాక
వంతులు నే నాడేనా వలపులు చల్లఁగాను
చెంతల నీవే దయ సేసేవు గాక

(॥వేగి॥)
చెనకితే నీకు మారు చేయి చాఁచేదాననా
కొనగోరి తాఁకులను కొసరేఁగాక
పెనఁగేనా నీతోను ప్రేమములు నీమీఁద
చినుకఁగా నీవే దయసేసేవు గాక

(॥వేగి॥)
మిక్కిలి నీ రతులను మీరేటి దాననా
వొక్కటై ముయికిముయి వొప్పించే గాక
వెక్కసాలాడేనా శ్రీ వేంకటేశ నిన్నుఁ గూడి
చెక్కు నొక్కఁగాను దయ సేసేవు గాక

(||pallavi||)
vegira mem̐ṭigi nāgu veyainānu
segadera nīve dayasesevu gāga

(||vegi||)
paṁtālu nīdo nenu pasāriṁche dānanā
pŏṁtabum̐ jūbulam̐ jūsi guḍisem̐ gāga
vaṁtulu ne nāḍenā valabulu sallam̐gānu
sĕṁtala nīve daya sesevu gāga

(||vegi||)
sĕnagide nīgu māru seyi sām̐sedānanā
kŏnagori tām̐kulanu kŏsarem̐gāga
pĕnam̐genā nīdonu premamulu nīmīm̐da
sinugam̐gā nīve dayasesevu gāga

(||vegi||)
mikkili nī radulanu mīreḍi dānanā
vŏkkaḍai muyigimuyi vŏppiṁche gāga
vĕkkasālāḍenā śhrī veṁkaḍeśha ninnum̐ gūḍi
sĕkku nŏkkam̐gānu daya sesevu gāga