Veggalabum goorimulu vibhunigim joobave

వెగ్గళపుఁ గూరిములు విభునికిఁ జూపవే
Language

(॥పల్లవి॥)
వెగ్గళపుఁ గూరిములు విభునికిఁ జూపవే
సిగ్గులు నెరపితేను చిత్తము గరఁగునా

(॥వెగ్గ॥)
వెంగెమాడి కోసరితే వేడుకలువుట్టుఎగాక
సంగడి నూరకుండితే చప్పనేకాదా
యెంగిలిమోవితేనెలు ఇంపులు రేఁచుఁగాక
ముంగిటిఆచారాలు మోహములు రేఁచునా

(॥వెగ్గ॥)
బీరమున బెనఁగితే ప్రియములు నిండుఁగాక
సారె వట్టివినయాలు చౌకలుగావా
గోరికొన దాఁకించితే గురుతులై వుండుఁగాక
దారకపుశాంతాలు తరితీపు రేఁచునా

(॥వెగ్గ॥)
కొమరెగుబ్బలూఁదితే కోరిక గోరించుగాక
సముకపు గొలువులు జాగులుగావా
అమర శ్రీవేంకటేశుఁ డలమేలుమంగ నిన్నేలె
అమితపు గోలతనా లాసలెల్లా రేఁచునా

(||pallavi||)
vĕggaḽabum̐ gūrimulu vibhunigim̐ jūbave
siggulu nĕrabidenu sittamu garam̐gunā

(||vĕgga||)
vĕṁgĕmāḍi kosaride veḍugaluvuṭṭuĕgāga
saṁgaḍi nūraguṁḍide sappanegādā
yĕṁgilimovidenĕlu iṁpulu rem̐sum̐gāga
muṁgiḍiāsārālu mohamulu rem̐sunā

(||vĕgga||)
bīramuna bĕnam̐gide priyamulu niṁḍum̐gāga
sārĕ vaṭṭivinayālu saugalugāvā
gorigŏna dām̐kiṁchide gurudulai vuṁḍum̐gāga
dāragabuśhāṁtālu taridību rem̐sunā

(||vĕgga||)
kŏmarĕgubbalūm̐dide koriga goriṁchugāga
samugabu gŏluvulu jāgulugāvā
amara śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁga ninnelĕ
amidabu goladanā lāsalĕllā rem̐sunā